ఆయన అంటే పిచ్చి.. డేటింగ్ చేస్తే తప్పేంటి.. శ్రీముఖి లవర్ ఎవరో తెలుసా?
శ్రీముఖి, రవి జంట యాంకర్ల మధ్య ఏదో ఉందంటూ వార్తలు ఈ మధ్య కాలంలో ఎక్కువగానే వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ప్రముఖ టెలివిజన్ ఛానెల్‌లో ఆలీ నిర్వహించే షోకు శ్రీముఖి, రవి హాజరయ్యారు. ఈ షోలో ఆలీ అడిగిన ప్రశ్
సినిమా పరిశ్రమ అయినా, టెలివిజన్ రంగమైనా ఇద్దరు తారలు, యాక్టర్ల మధ్య అఫైర్ ఉందంటూ పొగ రావడం సహజం. ప్రస్తుతం శ్రీముఖి, రవి జంట యాంకర్ల మధ్య ఏదో ఉందంటూ వార్తలు ఈ మధ్య కాలంలో ఎక్కువగానే వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ప్రముఖ టెలివిజన్ ఛానెల్‌లో ఆలీ నిర్వహించే షోకు శ్రీముఖి, రవి హాజరయ్యారు. ఈ షోలో ఆలీ అడిగిన ప్రశ్నలకు శ్రీముఖి, రవి ఘాటుగా స్పందించారు.

రవి అంటే పిచ్చి
కార్యక్రమంలో హోస్ట్ ఆలీ అడిగిన ఓ ప్రశ్నకు శ్రీముఖి స్పందిస్తూ.. రవి అంటే పిచ్చి. ఎందుకంటే చిల్లర అబ్బాయిలు.. మాస్ లుక్ ఉన్న అబ్బాయిల అంటే చాలా ఇష్టం అని చెప్పింది.

ఈలలు వేస్తూ వెంటపడేవారు..
నిజామాబాద్‌లో నీ వెనుక ఈలలు వేస్తూ వెంటపడేవారట కాదా అని ప్రశ్నకు సమాధానమిస్తూ.. అక్కడ నా వెంట నలుగురైదుగురు వెంటపడేవారు. అయితే మీరు అడిగిన వారెవరా అనేది కన్‌ఫ్యూజన్‌గా మారింది. మీరు ఎవర్ని అడిగి ఉంటారా అని సెటైర్ వేసింది శ్రీముఖి.

బైక్ మీద గానీ, కారులో
నాకు గుర్తున్నంత వరకు నిజామాబాద్‌లో అగర్వాల్ అనే అబ్బాయి వెంటపడేవారు. అయితే అతనితో బైక్ మీద గానీ, కారులో షికారు చేసిన దాఖలాలు లేవు అని శ్రీముఖి వెల్లడించింది.

శ్రీముఖితో అఫైర్ నిజమే
శ్రీముఖితో అఫైర్ ఉందనేది రూమర్ కాదు. అది నిజమే అని ఆలీ అడిగిన ఓ ప్రశ్నకు యాంకర్ రవి సమాధానం చెప్పారు. ఆ వార్తలో ఎలాంటి అనుమానం లేదు అని చెప్పుకొచ్చారు.

డేటింగ్ చేస్తే తప్పేమిటీ?
రవి మద్దతుగా శ్రీముఖి మాట్లాడుతూ.. మేమిద్దరం డేటింగ్ చేస్తే తప్పేమిటీ? ఏడాదిన్నరగా మేమిద్దరం కలిసి పనిచేస్తున్నాం. రెండు సంవత్సరాలుగా పరిచయం ఉంది. మా ఇద్దరి మధ్య మంచి రిలేషన్స్ ఉన్నాయి. ప్రశాంతత కోసం రెగ్యులర్‌గా బయట కలుసుకొంటున్నాం అని శ్రీముఖి చెప్పారు

పవన్ కల్యాణ్ అంటే ఇష్టం
టాలీవుడ్‌లో నాకు పవన్ కల్యాణ్ అంటే ఇష్టం. బాలీవుడ్‌లో రణ్‌వీర్ సింగ్ అంటే ఒకరకమైన పిచ్చి. లైఫ్‌లో అలాంటి వాడు భర్తగా వస్తే బాగుండు అని కోరుకొంటాను అని శ్రీముఖి ఓ ప్రశ్నకు జవాబు చెప్పింది.


Click it and Unblock the Notifications











