నిర్మాత పెళ్లి రిసెప్షన్ లో మెరిసిన మెగా హీరోలు(ఫోటోలు)
హైదరాబాద్: 'ఈ రోజుల్లో' చిత్రం నిర్మాత, మెగా హీరోల పిఆర్వో అయిన శ్రీనివాస కుమార్ వివాహ రిసెప్షన్ కి మెగా హీరోలు హాజరయ్యారు. జయభేరి క్లబ్ లో ఈ వేడుక చోటు చేసుకుంది. చాలా మంది సిని పెద్దలు ఈ పంక్షన్ కి వచ్చి ఈ జంటకు ఆశీస్సులు అందించారు. వారిలో ముఖ్యంగా అల్లు అరవింద్, అల్లు శిరీష్, అల్లు అర్జున్, రామ్ చరణ్ తేజ్, సాయి ధర్మ్ తేజ ఉన్నారు.

రామ్ చరణ్ తేజతో శ్రీనివాస కుమార్ కు మంచి అనుభందమే ఉంది. దాంతో తాను ఎంత బిజీగా ఉన్నా వచ్చి, ఈ జంటకు వివాహ శుభాకాంక్షలు అందచేసి, వారిని ఆనందపరిచారు.

'ఈ రోజుల్లో' చిత్రం ఆడియో పంక్షన్ కి అల్లు అర్జున్ వెళ్లి హిట్ కొట్టడానికి ఊతం ఇచ్చారు. మొదటి నుంచీ శ్రీనివాస్ కుమార్.. అల్లు కుటుంబానికి ఆప్తుడు. అదే ఈ వివాహ వేడుకలో వ్యక్తమైంది.

'ఈ రోజుల్లో' టీమ్ తదుపరి చిత్రం బస్ స్టాప్ హీరో ప్రిన్స్ ఈ వేడుకలో తళుక్కున మెరిసారు.

శ్రీనివాస్ కుమార్ కి అల్లు అరవింద్ గారంటే మంచి అభిమానం. ఆయన అండతోనే చిత్ర పరిశ్రమలో ఒక్కో మెట్టు ఎక్కుతున్నానంటూంటారు. అందుకే అల్లు అరవింద్ గారు పర్శనల్ గా వచ్చి ఈ జంటను అభినందించారు.

అల్లు అరవింద్ మరో కుమారుడు... గౌరవం చిత్రం హీరో అల్లు శిరీష్ కు శ్రీనివాస్ కు మంచి స్నేహం... అందుకే అల్లు శిరీష్ ఇలా...

రామ్ చరణ్ తో ఎవడు చిత్రం డైరక్ట్ చేస్తున్న స్టార్ డైరక్టర్ వంశీ పైడిపల్లి కూడా ఈ పంక్షన్ కి హాజరయ్యారు.

మెగా కుటుంబం నుంచి వస్తున్న మరో హీరో.. సాయి ధరమ్ తేజ... వైవియస్ చౌదరి రేయ్ చిత్రంలో చేస్తున్న ఈ కుర్రాడు.. మెగా పంక్షన్స్ లో తప్పనిసరి హాజరు.

పవన్ తో పంజా నిర్మించిన నీలిమా తిరుమల శెట్టి కూడా ఈ పీఆర్వో కి బాగా పరిచయం.. అందుకే ఆవిడ కూడా ఈ వేడుకకు హాజరైంది.

వేదం, పంజా, మర్యాద రామన్న నిర్మాతలు... శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ కూడా ఇక్కడ ఇలా ఈ నూతన జంట ప్రక్కన....

కెమెరామెన్ గంగతో రాంబాబు, నాయక్ చిత్రాల నిర్మాత, డివివి దానయ్య... హుషారుగా ఈ పంక్షన్ కి హాజరయ్యారు.


Click it and Unblock the Notifications











