Don't Miss!
- News సీఎం జగన్పై రాళ్లదాడి కేసులో బొండ ఉమ అరెస్ట్..?
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
తప్పకుండా ఫలితం దక్కుతుంది.. విష్ణు హార్డ్ వర్క్ పై శ్రీను వైట్ల కామెంట్
సీనియర్ డైరెక్టర్ శ్రీను వైట్ల నెక్స్ట్ డీ&డీ సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే. గత కొంతకాలంగా వరుస అపజయలతో సతమతమవుతున్న ఈ దర్శకుడు ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టి ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు. మంచు విష్ణు కూడా వరుస అపజయాలతో సతమతమవుతున్న విషయం తెలిసిందే. ఇక మొత్తానికి ఈ ఇద్దరు చాలా కాలం తరువాత కలవడం హాట్ టాపిక్ గా మారింది.
మంచు విష్ణు అయితే సినిమా కోసం నెవర్ బిఫోర్ అనేలా కష్టపడుతున్నాడు. చూస్తుంటే ఈ సారి నిజంగానే వీళ్ళు డబుల్ డోస్ ఎంటర్టైన్మెంట్ తో బాక్సాఫీస్ హిట్ కొట్టేలా ఉన్నారని అనిపిస్తోంది. శ్రీను వైట్ల ఒక ట్వీట్ ద్వారా హీరో పడుతున్న కష్టం గురించి చెప్పాడు. అలాగే అందులో మంచు విష్ణు వర్కౌట్ చేస్తున్న ఫొటోను కూడా షేర్ చేసుకున్నాడు. డీ &డీ పర్ఫెక్ట్ లుక్ కోసం ఈ హీరో చేస్తున్న కృషి దర్శకుడిని ఎంతగానో ఎట్రాక్ట్ చేసినట్లు కామెంట్ చేశాడు.
మై డియర్ బ్రదర్ విష్ణు నీ కమిట్మెంట్ అండ్ హార్డ్ వర్క్ పర్ఫెక్ట్ గా గా ఉంది. ఆ లుక్ కోసం ఎంతగానో కష్టపడుతున్నావు. అలాగే మేము కూడా స్క్రిప్ట్ విషయంలో మరింత కష్టపడతాము. మన హార్డ్ వర్క్ కు తప్పకుండా ఫలితం దక్కుతుంది అంటూ శ్రీను వైట్ల చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ఇక ఈ సినిమా షూటింగ్ ను త్వరలోనే స్టార్ట్ చేయాలని దర్శకుడు స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడు. ఆల్ మోస్ట్ ఫీనిషింగ్ టచ్ ఇస్తున్నట్లు సమాచారం. చూడాలి మరి ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో..