Don't Miss!
- News జపాన్ను వణికించిన భూకంపం
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
మీరు ప్రతీసారి చెప్పే ఆ మాట ఎప్పటికీ నాకు ఆశీర్వాదమే.. జయప్రకాష్ రెడ్డి మృతిపై శ్రీనువైట్ల ఎమోషనల్
జయప్రకాష్ రెడ్డిలోని విలనిజాన్ని బీ గోపాల్ పరిచయం చేయగా.. ఆయనలో కామెడీ టైమింగ్, కమెడియన్‌ను తెలుగు తెరకు పరిచయం చేసింది శ్రీనువైట్ల. దాదాపు శ్రీనువైట్ల తీసిన అన్ని సినిమాల్లో జయప్రకాష్ రెడ్డికి ఓ స్పెషల్ క్యారెక్టర్ ఉంటుంది. ఆ పాత్ర సూపర్ డూపర్‌గా క్లిక్ అవుతుంది. రెడీ, ఢీ సినిమాల్లోని ఫార్మూలా ఎంతగా క్లిక్ అయిందో అందరికీ తెలిసిందే. కెరీర్ ప్రారంభం నుంచి జయ ప్రకాష్ రెడ్డితో అనుబంధం ఉన్న శ్రీనువైట్ల ఎమోషనల్ అవుతున్నాడు.
జయప్రకాష్ రెడ్డి మరణ వార్త విన్న శ్రీను వైట్ల దిగ్భ్రాంతికి లోనయ్యాడు. ఈ మేరకు జేపీతో ఉన్న అనుబంధాన్ని గుర్తుకు చేసుకున్నాడు. మై డియర్ అంకుల్.. నా కెరీర్ ప్రారంభం నుంచీ మీరు నాకు తెలుసు. మీరు నాపై కురిపించిన ప్రేమను ఎప్పటికీ మరిచిపోలేను. ప్రతీ సన్నివేశాన్ని మీ ఉత్సాహంతో నటించి నింపేశారు. మీరెప్పుడూ ఓ మాటతోనే ఫోన్‌ను కట్ చేసేవారు.
'నాన్న మనం ఇక్కడి వారమే.. మనం సినిమా రంగానికి చెందినవారమే' అదే నాకు మీ ఆశీర్వాదంలా నా వెంటే ఉంటుంది. మీ గురించి నాకు తెలిసినందుకు నేను ఎంతో సంతోషంగా ఫీల్ అవుతున్నాను. జేపీ అంకుల్ మీ ఆత్మకు శాంతి చేకూరాలి. మిమ్మల్ని మిస్ అవుతున్నాం.. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
జయ ప్రకాష్ రెడ్డి మరణంపై యావత్ సినీ పరిశ్రమ స్పందిస్తోంది. టాలీవుడ్ టాప్ హీరోల నుంచి డైరెక్టర్లు, నిర్మాతలు, కమెడియన్స్, హీరోయిన్లు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్, అనిల్ రావిపూడి, గోపిచంద్ మలినేని, వెన్నెల కిషోర్, బండ్ల గణేష్, మహేష్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ, ప్రకాష్ రాజ్ ఇలా ఎంతో మంది స్పందించారు. ఇంకా స్పందిస్తూనే ఉన్నారు.