లైవ్ లో శ్రీను వైట్ల పై మండి పడ్డ మహేష్ ఫ్యాన్
హైదరాబాద్ : తమ అభిమాన హీరో కు హిట్ ఇస్తానంటూ తీసిన సినిమా తన అంచనాలకు తగినట్లు లేకపోవటంతో మహేష్ అభిమానులు మండిపడుతున్నారు. ఆగడు దర్శకుడు శ్రీను వైట్ల పై ఓ స్ధాయిలో సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో విరుచుకుపడుతున్న వారు టీవీ ఛానెల్ లో లైవ్ కు వెళ్లిన శ్రీను వైట్ల ను సైతం నిలదీస్తున్నారు. రీసెంట్ గా ఓ పాపులర్ టీవీ ఛానెల్ కు లైవ్ కు ప్రమోషన్ నిమిత్తం వెళ్లిన శ్రీను వైట్లకు అలాంటి అనుభవం ఎదురైంది.
తమ ఆగడు చిత్రం హిట్ కు ఏయో కారణాలు దోహదం చేసాయో శ్రీను వైట్ల చెప్తూంటే ఓ అభిమాని ఫోన్ లోకి లైన్ లోకి వచ్చారు. రెగ్యులర్ ఫార్ములా కథాంశంతో తమ హీరో సినిమాను తీసావంటూ ఇలా తమ కోపం వెళ్ల గక్కారు. ఈ లోగా లైన్ కట్ అయ్యిందని ఛానెల్ వారు అన్నారు. దూకుడు నే మరోసారి సెకండాఫ్ లో తీసారంటూ చాలా మంది అభిమానులు ఇలాగే ఆయనపై కోపం ప్రదర్శిస్తున్నారు.

తెలుగు సినిమా చరిత్రలో రికార్డు స్థాయిలో ‘ఆగడు' చిత్రాన్ని దాదాపు 2వేల థియేటర్లలో విడుదల చేసారు. ‘దూకుడు' కాంబినేషన్ అయిన శ్రీను వైట్ల-మహేష్ బాబు సినిమా కావడంతో అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. దీంతో అధిక ధర చెల్లించి ప్రీమియర్ షోలోలు చూసేందుకు సైతం ప్రేక్షకులు ఎగబడ్డారు.
ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం....తొలి మూడు రోజుల్లో ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో కలిసి దాదాపు 25 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. తొలి రోజు రూ. 11.20 కోట్లు, సెకండ్ డే 7.20 కోట్లు, థర్డ్ డే 6.60 కోట్లు వసూలు చేసింది. అయితే ఇది ట్రేడ్ వర్గాల అంచనా మాత్రమే. అఫీషియల్ సమాచారం వెలువడాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











