ఆగడు: మహేష్ అలా..శ్రీను వైట్ల ఇలా

By Srikanya

హైదరాబాద్ : బయిట జనాల కన్నా కొద్దో గొప్పో సినిమావాళ్లకు సెంటిమెంట్స్ ఎక్కువ ఉంటాయి. కోట్లతో, అంతకుమించిన కెరీర్ లు ఒక్క మార్నింగ్ షో తేల్చేస్తుంది. అందుకే వారు రకరకాలుగా తమ సినిమా విడుదల ముందు... తమకు నమ్మకమైన గుళ్లను దర్శిస్తూంటారు. తాజాగా మహేష్,శ్రీను వైట్ల కాంబినేషన్ లో రూపొందిన ఆగడు విడుదలకు సిద్దంగా ఉంది. ఈ నేపధ్యంలో కడప లోని అజ్మీర్ దర్గాని దర్శించుకున్నారు. అక్కడ ఖ్వాజా మెయినుద్దీన్ చస్తీ వద్ద ప్రత్యేక ప్రార్ధనలు చేసారు.

మరో ప్రక్క దర్శకుడు శ్రీను వైట్ల తనకు సింహాచలం వరాహ నరసింహ స్వామిని దర్శించుకుకున్నారు. ఈ విషయాన్ని ఆయన చెప్తూ... ప్రతీ సినిమా విడుదల ముందు నేను శ్రీ వరాహ నరసింహ స్వామి..సింహాచలం గుడిని దర్శిస్తూంటాను. అక్కడ నేను పూజ చేస్తూంటాను. ఆయన నాకు ఇష్టమైన దైవం, సెంటిమెంట్, ఆయన చాలా పవర్ ఉన్న దేముడు. నేను ఆయన్ను దర్శించగానే నాలో కొత్త ఎనర్జీ ప్రవేశిస్తుంది అన్నారు.

Sreenu Vaitla's Sentiment for Aagadu

దర్శకుడు మాట్లాడుతూ ‘‘మహేష్‌బాబు పెర్‌ఫార్మెన్స్‌, హీరో పాత్ర ‘ఆగడు'లో మెయిన్‌ హైలైట్స్‌. మహేష్‌బాబులో ఇంతకు ముందు చూడని కొత్త షేడ్స్‌ను ‘ఆగడు'లో చూస్తారు. ఆయన కామెడీ టైమింగ్‌ బావుంటుంది. అభిమానుల్లో ‘ఆగడు' పండగ వాతావరణాన్ని క్రియేట్‌ చేస్తుంది'' అని తెలిపారు. శ్రీను వైట్ల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన తమన్నా జోడీ కట్టింది. శృతి హాసన్ ఓ స్పెషల్ సాంగ్ లో కనిపిస్తున్న ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందించాడు.

నిర్మాతలు మాట్లాడుతూ ‘‘ఈ నెల 19న సినిమాను విడుదల చేస్తున్నాం. ఇటీవల విడుదలైన పాటలకు, మా ట్రైలర్లకు మంచి స్పందన వస్తోంది'' అని అన్నారు. ఈ సినిమాకు రచన: అనిల్‌ రావిపూడి, ఉపేంద్ర మాధవ్‌, రచనా సహకారం: ప్రవీణ్‌ వర్మ, సంగీతం: ఎస్‌.ఎస్‌.థమన్‌, కెమెరా: కె.వి.గుహన్‌, ఆర్ట్‌: ఎ.ఎస్‌.ప్రకాష్‌, ఎడిటింగ్‌: ఎం.ఆర్‌.వర్మ, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: కోటి పరుచూరి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X