'ఢీ' సినిమా హిట్ నుంచి శ్రీను వైట్ల పరిస్ధితి మారిపోయింది. వరస ఆఫర్స్ తో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. ఇప్పుడు బాలకృష్ణ సినిమానుసైతం డైరక్ట్ చేసే ఛాన్స్ వచ్చే అవకాశం ఉందిట. గతంలో 'వంశానికొక్కడు, ఆదిత్యా 369' వంటి హిట్ సినిమాలు బాలయ్యతో అందించిన శ్రీదేవి మూవీస్ ఈ ప్రయత్నం చెయ్యబోతోందిట. ప్రస్తుతం శ్రీను వైట్ల 'రెడీ.. దేనికైనా' సినిమాను స్రవంతి మూవీస్ బ్యానర్ పై 'దేవదాస్' ఫేమ్ రామ్ తో చేస్తున్నాడు. బాలకృష్ణ కె.రాఘవేద్రరావు దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న పాండురంగడులో బిజీగా ఉన్నారు. అలాగే శ్రీను వైట్ల నాగార్జున 'కింగ్' సినిమాకి కమిటై ఉన్నాడు. బాలకృష్ణ హీరోగా గుణశేఖర్ సాధు స్కిప్టు రెడీ అవుతోంది. కాబట్టి డిసెంబర్ లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంటుందంటున్నారు. కాబట్టి త్వరలోనే బాలకృష్ణ ఓ కామిక్ ఎంటర్ టైనర్ తోఅలరించబోతున్నారన్నమాట.