పవర్ స్టార్ పవన్ తో శ్రీను వైట్ల చిత్రం??
"ఆనందం" సినిమాతో దర్శకుడిగా చిత్ర సీమకు పరిచయమైనా శ్రీను వైట్ల ఎన్నో మంచి సినిమాలు తీసి అగ్ర దర్శకుల జాబితాలో చేరారు. దాదాపు చిరంజీవి, నాగార్జున, తాజాగా వెంకటే వంటి అగ్ర హీరోలతో సినిమాలు తీసిన ఆయన రవితేజ, విష్ణు వంటి యువ హీరోలతో కూడా సినిమాలు తీసి హిట్ కొట్టారు. ఆయన ఓ కథ సిద్ధం చేసుకున్నారు. దీనికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో అయితే బాగా సూట్ అవుతారని ఆయన భావిస్తున్నారు. త్వరలోనే ఈ కథను పవన్ కి వినిపించి ఆయన ఒప్పుకుంటే సినిమాను సెట్స్ పైకి తీసుకొస్తారు. ప్రస్తుతం శ్రీను వైట్ల వెంకటేష్ హీరోగా త్రిష హీరోయిన్ గా "నమో వెంకటేష్" సినిమాను తీసుతున్నారు.
పవన్ కళ్యాణ్ శ్రీను వైట్ల ఆనందం ఆకాష్ చిరంజీవి నాగార్జున వెంకటేష్ త్రిష రవితేజ విష్ణు pawan kalyan sreenu vytla anandam akash chiranjeevi nagarjuna venkatesh trisha raviteja vishnu


Click it and Unblock the Notifications