శ్రీను వైట్ల డైరక్షన్ లో రామ్ చరణ్?

అయితే చిరంజీవి పొలిటిల్ ఎంట్రీ హడావిడిలో ఇది చిన్న విషయమై ప్రక్కకు వెళ్ళింది. దాంతో అసలు మినిమం గ్యారెంటీ దర్శకుడుగా మారిన శ్రీను వైట్ల వారి దృష్టికి వచ్చారుట. అందులోనూ శ్రీను గతంలో చిరంజీవితో అందరివాడు చిత్రాన్ని రూపొందించారు. దాంతో అతనికే ప్రిఫెరన్స్ ఇచ్చారని తెలుస్తోంది.
అయితే రెడీ విజాయానంతరం ఊపుమీదున్న శ్రీను వైట్ల ఇప్పుడు కంటిన్యూగా వచ్చిపడుతున్న ఆఫర్స్ లో వేటిని ఎంచుకోవాలా అనే డైలమాలో ఉన్నట్లు తెలుస్తోంది. అందులోనూ రామ్ చరణ్ తేజ ని డైరక్ట్ చేయమనే అవకాశం రావటం క్రేజే గాని దాని నిమిత్తం కమిట్ అయిన వాటిని వదులుకోవటమనేది కోరి శతృత్వాలు తెచ్చిపెట్టుకున్నట్లు అవుతుందని భావిస్తున్నారుట. మరి ఈ కాంబినేషన్ వర్కవుట్ అయితే చూడాలని అబిమానులు ఎదురు చూస్తున్నారు. చూద్దాం ఎప్పటికి ఈ ప్రాజెక్టు మెటీరియలైజ్ అవుతోందో...


Click it and Unblock the Notifications











