మహేష్ 'త్రీ రాస్కేల్స్' టీం ఫిక్సయ్యింది
మహేష్, శంకర్ దర్శకత్వంలో త్రీ ఇడియట్స్ చిత్రం రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఎవరు నటించనున్నారు అన్న దానికి శంకర్ ఓ తమిళ పేపరులో క్లారిఫై చేసారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి...మొదటినుంచి అనుకున్నట్లుగానే అమీర్ ఖాన్ చేసిన లీడ్ క్యారెక్టర్ ని తెలుగులో మహేష్ బాబు, తమిళంలో విజయ్ చేస్తారు. ఇక శర్మాన్ జోషి చేసిన పాత్రను తెలుగు, తమిళంలో శ్రీరామ్(ఒకరికి ఒకరు ఫేమ్) చేస్తారు. ఇక మాధవన్ పాత్రకు తమిళ హీరో జీవాని ఎంపిక చేసారు. ఇలియానా..కరినా కపూర్ పాత్రకు, సత్యరాజ్..బొమన్ ఇరాని చేసిన ప్రొపిసర్ పాత్రలో కనిపించనున్నారు. హ్యారీష్ జైరాజ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తారు. ఏ మాయ చేసావేకి కెమెరా వర్క్ చేసిన మనోజ్ పరమహంసని ఛాయా గ్రహణంకు ఎంపిక చేసారు. జెమిని ఫిల్మ్ సర్క్యూట్ వారు నిర్మించే ఈ చిత్రం డిసెంబర్ మొదటి వారం నుంచి షూటింగ్ ప్రారంభమవుతుంది. టైటిల్ గా త్రీ రాస్కేల్స్ అని పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











