పూరి జగన్నాథ్ గుహలో శ్రీశాంత్, సల్మాన్ గర్ల్ (ఫోటో)
హైదరాబాద్: దర్శకుడు పూరి జగన్నాథ్ ఇటీవల రూ. 20 కోట్ల ఖర్చుతో జూబ్లీ హిల్స్ లో తన టేస్టుకు అనుగుణంగా విశాలమైన ఆఫీస్ కమ్ హౌస్ ను నిర్మించుకున్న సంగతి తెలిసిందే. కేవ్ (గుహ)గా పిలుస్తున్న ఈ ఇంటిని అద్భుతమైన ఇంటీరియర్ తో డిజైన్ చేసారు. పూరి జగన్నాథ్ ఇంటిని చూసేందుకు పలువురు ప్రముఖులుక్యూ కడుతున్నారు. తాజాగా ఈ ఇంటిని చూసేందుకు మాజీ క్రికెటర్ శ్రీశాంత్, బాలీవుడ్ నటి జరీన్ ఖాన్ వచ్చారు. తన ఇంట్లో వీరికి మంచి విందు ఏర్పాటు చేసారు పూరి.
ఫిక్సింగ్ ఆరోపణలతో నిషేదానికి గురైన శ్రీశాంత్ ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో నటుడిగా, మ్యూజిక్ కంపోజర్ రాణించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక సల్మాన్ ఖాన్ వీర్ సినిమా ద్వారా బాలీవుడ్ కి పరిచయమైన జరీన్ ఖాన్ ఓ ఫ్యాషన్ షోలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చింది. ఇద్దరినీ తన ఇంటికి ఆహ్వానించి విందు ఏర్పాటు చేసారు పూరి జగన్నాథ్.

ఈ ఇద్దరూ పూరి జగన్నాథ్ ను కలవడంతో రకరకాల వార్తలు జోరందుకున్నాయి. పూరి జగన్నాథ్ చేయబోయే సినిమాల్లో వీరు నటించబోతున్నారనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
పూరి జగన్నాథ్ జూబ్లీహిల్స్‌లో సకల సౌకర్యాలు, అద్భుతమైన ఇంటీరియర్స్ కూడిన విలాసవంతమైన ఇల్లు కట్టుకున్నారు. ఇంటితో పాటు తన సినిమా ఆఫీసు కార్యకలాపాలకు, స్టోరీ డిస్కర్షన్స్‌కు ఉపయోగ పడేలా ప్రత్యేకంగా ఈ ఇంటిని డిజైన్ చేసారు.
ఇందులో వాడిన ఫర్నీచర్, గోడలకు ప్రత్యేకమైన రంగులు, ప్రత్యేకమైన డిజైన్స్.....ఇలా మొత్తం కలిసి రూ. 20 కోట్ల వరకు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్‌లోని రోడ్ నెం.34లో ఈ ఇంటిని నిర్మించారు. ఆఫీస్ స్పేస్ కోసం 18000 చదరపు అడుగులు కేటాయించారు.


Click it and Unblock the Notifications











