అక్కినేని కుటుంబరావు అమూల్యం
గతంలో అనేక ఆర్ట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన అక్కినేని కుటుంబరావు మరో వెంచర్ చేయబోతున్నారు. అక్కినేని కుటుంబరావు దర్శకత్వంలో చిల్డ్రన్ ఫిలిమ్ సొసైటీ ఆఫ్ ఇండియా అమూల్యం అనే చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ 5న ప్రారంభమై, సింగిల్ షెడ్యూల్లో పూర్తవుతుందని కుటుంబరావు తెలిపారు. ఇందులో సురేశ్, డబ్బింగ్ జానకి, బేబీ వర్షిణి ముఖ్యపాత్రధారులు. ఈ చిత్రానికి కథ,మాటలు: ఓల్గా; సినిమాటోగ్రఫి: మధు అంబట్; స్క్రీన్ప్లే, దర్శకత్వం: అక్కినేని కుటుంబరావు.


Click it and Unblock the Notifications