శ్రీహరి మరణం మరువక ముందే మరో విషాదం

By Bojja Kumar

హైదరాబాద్: రియల్ స్టార్ శ్రీహరి మరణానికి సంబంధించిన విషాద ఛాయలు ఇంకా వీడనే లేదు....ఆయన కుటుంబంలో మరో విషాదం చోటు చేసుకుంది. శ్రీహరి తండ్రి రఘుముద్రి సత్యనారాయణ(80) మంగళవారం ఉదయం మృతి చెందారు. గత కొంత కాలంగా డయాబెటిస్ వ్యాధితో బాధ పడుతున్న సత్యనారాయణ డయాలసిస్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.

కుటుంబ సభ్యుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం సత్యనారాయణ గుండె పోటుకు గురై మరణించినట్లు తెలుస్తోంది. గుండె పోటు వచ్చిన వెంటనే ఆయన్ను సమీపంలోకి ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆయన అప్పటికే మరణించినట్లు డాక్టర్లు ధృవీకరించారు. సత్యానారాయణ అంత్య క్రియలు బాచుపల్లిలో బుధవారం జరుగనున్నాయి.

Sri Hari's father passed away

కృష్ణా జిల్లాలోని విజయవాడ సమీప గ్రామానికి చెందిన సత్యనారాయణ చాలా ఏళ్ల క్రితమే హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. ఆయన హైదరాబాద్ వచ్చే నాటికి శ్రీహరి చాలా చిన్నవాడు. తండ్రి సత్యనారాయణ ప్రోత్సాహం ఉండటం వల్లే శ్రీహరి సినిమా పరిశ్రమ వైపు తన ప్రయాణం కొనసాగించారు. సత్యనారాయణ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేసారు.

తెలుగు సినీ పరిశ్రమలో తన టాలెంట్, పెర్ఫార్మెన్స్‌తో విలన్‌గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు శ్రీహరి రియల్ స్టార్ అనే పేరు తెచ్చుకున్నారు. కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధ పడుతున్న ఆయన గతేడాది అక్టోబర్లో మరణించిన విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X