క్రికెటర్ మలింగ బాగోతాన్ని బయట పెట్టిన చిన్మయి.. సంచలన వ్యాఖ్యలు!
Recommended Video

భారత చిత్ర పరిశ్రమలో మీటూ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. తనుశ్రీ దత్త ఈ పోరాటం మొదలు పెట్టిన తరువాత మిగిలిన హీరోయిన్లు, నటీమణులు తమకు ఎదురైన వేధింపులని ధైర్యంగా ప్రస్తావిస్తున్నారు. ప్రముఖ సింగర్ చిన్మయి కూడా గత కొన్ని రోజులుగా తనకు ఎదురైన లైంగిక వేధింపులని ప్రస్తావిస్తోంది. తాజాగా ఈ ఉద్యమ సెగ క్రీడారంగానికి కూడా తగిలింది. క్రికెటర్ మలింగ ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన సంఘటనని చిన్మయి ట్విట్టర్ వేదికగా బయట పెట్టింది. బాధితురాలు చిన్మయికి ఈ సంఘటన వివరించిందట.

ముంబై హోటల్ గదిలో
బాధితురాలు చిన్మయితో చెప్పిన సంగతులు ఇలా ఉన్నాయి.. కొన్నేళ్ల క్రితం ఐపీఎల్ సందర్భంగా ఈ సంఘటన జరిగింది. నా స్నేహితురాలితో ముంబైలోని ఓ హోటల్ లో కలసి బస చేయవలసి వచ్చింది. అదే హోటల్ లో శ్రీలంక క్రికెటర్ మలింగ కూడా ఉన్నాడు. ఆ రోజు మలింగ ప్రవర్తించిన తీరు తనకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించిందని బాధితురాలు చిన్మయితో తెలిపింది.

నా రూమ్‌లో ఉంది
నా ఫ్రెండ్ కోసం నేను హోటల్ గది బయట ఎదురుచూస్తున్నా. సమీపంలోనే మలింగ బస చేసిన గది కూడా. మీ ఫ్రెండ్ కోసం ఎదురుచూస్తున్నావా.. నా రూమ్ లో ఉంది రా అంటూ పిలిచాడు. నిజమే అనుకుని వెళ్ళాను. కానీ లోపల నా స్నేహితురాలు లేదు. నన్ను అమాంతం తన చేతుల్లో బందించి బెడ్ పై తోసేశాడు. చాలా అసభ్యంగా ప్రవర్తించాడు.
ప్రతిఘటించినా కూడా
ఎంత ప్రతిఘటించిన అతడి నుంచి తప్పించుకోవడం కుదర్లేదు. సరిగ్గా ఆ సమయంలోనే హోటల్ సిబ్బంది డోర్ కొట్టారు. నేను వెంటనే వాష్ రూమ్ లోకి వెళ్ళిపోయాను. ఆ తరువాత హోటల్ సిబ్బందితో పాటు మలింగ రూమ్ నుంచి బయట పడ్డాను.

బయటకు చెబితే
ఈ సంఘటనని బయటకు చెబితే.. అతడు స్టార్ క్రికెటర్.. నీవే ఇష్టపడి వెళ్లి ఉంటావు అని అంతా నన్ను నిందించేవారు. అందుకే ఇన్నిరోజులు ఈ సంఘటనని బయటకు చెప్పలేదని ఆ మహిళ తెలిపింది. అయినా కూడా నా సన్నిహితులతో ఈ విషయాన్ని పంచుకున్నాను. వారంతా నాదే తప్పు అని మాట్లాడడంతో చాలా అవమానంగా అనిపించింది.

తమిళ రచయితపై
ఇదిలా ఉండగా చచిన్మయి ఇప్పటికే తనకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలో తమిళ రచయిత వైరముత్తుపై సంచలన ఆరోపణలు చేసింది. తాజగా మలింగ గురించి చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. స్టార్ క్రికెటర్ అయిన మలింగ ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన సంఘటనని బట్టబయలు చేసింది.


Click it and Unblock the Notifications











