Don't Miss!
- News సీఎం జగన్‌పై రాళ్లదాడి కేసులో బొండ ఉమ అరెస్ట్..?
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
హీరోయిన్ 'కామసూత్ర' బిజినెస్: ఇలాంటివి టచ్ చేస్తే.. త్వరగా!
క్రేజ్ ఉన్నప్పుడే దాన్ని క్యాష్ చేసుకోవడం సెలబ్రిటీలకు వెన్నతో పెట్టిన విద్య. ఓవైపు సినిమాలు.. మరోవైపు బిజినెస్.. ఇలా రెండు చేతులా సంపాదిస్తున్న సెలబ్రిటీలకు ఇప్పుడు కొదువ లేదు.
ఈ జాబితాలో తాజాగా మరో హీరోయిన్ కూడా చేరిపోయారు. శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తాజాగా హోటల్ బిజినెస్ లోకి అడుగుపెట్టారు. ఇంతకీ ఈ బ్యూటీ ఆమె హోటల్‌కు ఏం పేరు పెట్టిందో తెలుసా..
హోటల్ 'కామసూత్ర':
శ్రీలంకలో చైన్ హోటల్స్ బిజినెస్‌ను ప్రారంభించిన జాక్వెలిన్.. ఆ హోటల్స్‌కు కామసూత్ర అని పేరు పెట్టారు. హోటల్స్ పేరు కాస్త డిఫరెంట్‌గా పెట్టాలని ట్రై చేసేవాళ్లున్నారు కానీ.. ఇలా 'కామసూత్ర' అని పెట్టడమేంటోనని ఈ సంగతి తెలిసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు.
Recommended Video
ఇలాంటివి టచ్ చేస్తేనే!:
హోటల్స్‌కు 'కామసూత్ర' అనే టచ్ ద్వారా కావాల్సినంత పాపులారిటీ వస్తుందని జాక్వెలిన్ భావించి ఉండవచ్చు. పైగా కామసూత్ర అన్న పేరు ప్రపంచవ్యాప్తంగా పాపులర్. ఇలాంటి పదాలు జనాల్లో ఎప్పటినుంచో పాతుకుపోయి ఉన్నాయి కాబట్టి.. ఇప్పుడదే పేరుతో ఆమె హోటల్ బిజినెస్ మొదలుపెట్టేశారు.
జాక్వెలిన్ క్రిస్మస్ వేడుకలు:
తొలిసారి క్రిస్మస్ వేడుకలను ముంబైలో జరుపుకున్నారు జాక్వెలిన్. పండుగను ఎలా ఎంజాయ్ చేశారని అడిగితే.. 'స్నేహితులతో కలిసి డిన్నర్, టేస్టీ పాస్తా.. ఒక గ్లాస్ వైన్, సినిమాలు చూస్తూ.. అలా అలా..' అని ముగించేశారు.
జాక్వెలిన్ సినిమాలు:
2011లో మర్డర్-2 సినిమా ద్వారా ఇండియన్ స్క్రీన్ పై జాక్వెలిన్ మెరిసింది. ఈ సినిమాలో జాక్వెలిన్ చేసిన గ్లామర్ షో వరుస అవకాశాలను తెచ్చిపెట్టింది. అలా హౌజ్ ఫుల్-2, రేస్-2, కిక్, చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ తో కలిసి రేస్-3చిత్రంలో నటిస్తోంది.