100 రోజులు పూర్తి చేసుకున్న బాలకృష్ణ సినిమా

By Bojja Kumar

నందమూరి బాలకృష్ణ రాముడి పాత్రలో, నయనతార సీతపాత్రలో ప్రముఖ దర్శకుడు బాపు దర్శకత్వంలో రూపొందిన శ్రీరామ రాజ్యం సినిమా నేటితో 100 రోజులు పూర్తి చేసుకుంది. విడుదల రోజే ఓ అందమైన, నయనానందకరమైన దృశ్య కావ్యంగా ప్రేక్షకులు, క్రిటిక్స్ చేత ప్రశంసలు అందుకున్న ఈ మూవీ 100 రోజుల పాటు సక్సెస్ ఫుల్ గా రన్ అయింది. ముఖ్యంగా ఈ సినిమాకు బాలయ్య, నయనతార నటనతో పాటు బాపు దర్శకత్వం, ఇళయరాజా అందించిన మ్యూజిక్ వెన్నముఖగా నిలిచింది. యలమంచిలి సాయిబాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం విజయవంతం అయిన నేపథ్యంలో బాలయ్య మరిన్ని పౌరాణిక సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నారు.

ప్రస్తుతం బాలకృష్ణ అధినాయకుడు చిత్రంలో నటిస్తున్నాడు. పరుచూరి మురళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎం.ఎల్. కుమార్ చౌదరి నిర్మిస్తున్నారు. బాలయ్య ఈ చిత్రంలో మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారు. సలోని, లక్ష్మిరాయ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో జయసుధ, సుకన్య, కోట శ్రీనివాసరావు, వేణుమాధవ్, బ్రహ్మానందం, చరణ్ రాజ్, ఎంఎస్ నారాయణ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు, సంగీతం : కళ్యాణి మాలిక్. మార్చి 23న ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X