భద్రాద్రికి బాలయ్య, షిర్డీకి నాగార్జున
బాలకృష్ణ శ్రీరాముడిగా, నయనతార సీతాదేవిగా ప్రఖ్యాత దర్శకుడు బాపు దర్శకత్వంలో రూపొందుతున్న 'శ్రీరామరాజ్యం' చిత్రం ఆడియో వేడుక ఆగష్టు 15న జరుగుతుంది. భద్రాచలంలోని రామయ్య, సీతమ్మల సన్నిధిలో ఈ సినిమా పాటలని విడుదల చేయడానికి నిర్మాత యలమంచిలి సాయిబాబు సన్నాహాలు చేస్తున్నారు. ఇళయరాజా స్వరాలు కూర్చిన ఈ చిత్రంలోని పాటలు అందరినీ అలరిస్తాయని నిర్మాత చెబుతున్నారు.
మరో ప్రక్క నాగార్జున కొత్త చిత్రం "శిరిడి సాయి" మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రస్తుతం షిర్డీలో జరుగుతున్నాయి. కీరవాణి సంగీత దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రాఘవేంద్రరావు తెరకెక్కించనున్నారు."శిరిడి సాయి" చిత్రానికి యస్ గోపాల రెడ్డి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. నాగార్జున "శిరిడి సాయి" చిత్రానికి సంభాషణలను పరుచూరి బ్రదర్స్ వ్రాస్తున్నారు. నాగార్జున "శిరిడి సాయి" చిత్రానికి భక్త సురేష్ కుమార్ కథా సంకలనాన్ని అందిస్తూండగా, పొందూరి హనుమంతరావు కథా సహకారాన్ని అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











