‘శ్రీరామ రాజ్యం’ఆడియో విడుదల తేదీ..వెన్యూ
రాముడి గెటప్, సీత గెటప్ ఉన్న ఫోటోలు ఇంతవరకు విడుదల చేయలేదు. ఇప్పుడు సీత గెటప్‌లో నయనతార ఫోటోలు విడుదల చేస్తున్నాం అంటూ 'శ్రీరామరాజ్యం"నిర్మాత సీతగా ఉన్న నయనతార ఫోటోను విడుదల చేసారు. సినిమా ప్రారంభమై, పూర్తయనా ఇంతవరకు నయనతారకు సంబంధించిన ఒక్క స్టిల్ కూడా బయటకు రాలేదు. తొలిసారిగా మంగళవారం ఒక స్టిల్‌ను నిర్మాత విడుదల చేసారు. అలాగే 'శ్రీరామరాజ్యం" చిత్రంలోని పాటలను ఆగస్టు 15న భద్రాచలంలో విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా చిత్రనిర్మాత మాట్లాడుతూ- 'చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. ఓ మంచి చిత్రం నిర్మించామన్న ఆనందం కలుగుతోంది. ఈ చిత్రంలోని పాటలకు ఇళయరాజా సంగీతం అందించారు. ఆడియో విడుదల కార్యక్రమం భద్రాద్రిలో సీతారాముల సన్నిధిలో ఆగస్టు 15న జరగనుంది. ఈ సందర్భంగా అందరికీ ఇదే ఆహ్వానమ"ని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: బాపు


Click it and Unblock the Notifications











