దర్శకులను అవమానిస్తే ఊరుకోను...శ్రీరామ రాజ్యం ఆడియో సక్సెస్ మీట్ లో బాలయ్య

By Bojja Kumar

నందమూరి బాలకృష్ణ శ్రీరాముడి పాత్రలో, నయన తార సీత పాత్రలో....ప్రముఖ దర్శకుడు బాపు దర్శకత్వంలో రూపొందిన చిత్రం శ్రీరామ రాజ్యం. రామాయణం ఆదారంగా తెరకెక్కిన ఈ సినిమా మరి కొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇళయరాజ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు యలమంచిలి సాయిబాబు నిర్మాత. ఇప్పటికే విడుదలైన ఆడియో సూపర్ సక్సెస్ సాధించింది. ఈ సందర్భంగా సోమవారం రాత్రి హైదరాబాద్ లో ఆడియో సక్సెస్ మీట్ ఏర్పాటు చేసి....ఈ సినిమాలో బాలయ్య పోషించిన శ్రీరాముడి పాత్ర ఫోటోలను అక్కినేని నాగేశ్వరరావు, రాఘవేంద్రరావుల చేతుల మీదుగా విడుదల చేశారు.

ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ...''తెలుగు చూడాలంటే బాపు... తెలుగు వినాలంటే రమణ. అందుకు నిదర్శనమే ఈ శ్రీరామరాజ్యం. ఈ రోజు రాముడిగా నన్ను చూశారు. రేపు ఈ రాముడు పలుకులు ఎలా ఉంటాయో వింటారు. ఒక దృశ్యకావ్యంగా ఈ సినిమాను మలిచారు బాపు. ఆయన తప్ప ఈ కథను ఇంతబాగా తీయగలిగిన వారు లేరు. ఇటీవల ఓ వ్యక్తి ఓ పరభాషా దర్శకుడి గురించి గొప్పగా మాట్లాడుతూ మన తెలుగు దర్శకులను అవమాన పరిచాడు. అప్పుడే ఆ వ్యక్తికి జాగ్రత్తగా మాట్లాడమని హెచ్చరించాను."" అన్నారు.

నాగేశ్వరరావు మాట్లాడుతూ ''సంస్కృ తిని పాడుచేస్తున్న సినిమాలు వస్తున్న నేటి తరుణంలో 'శ్రీరామరాజ్యం" సినిమా ప్రేక్షకులకు ఒక చల్లని పిల్ల తెమ్మర లాంటిది"" అన్నారు. ఈ కార్యక్రమంలో ఇళయరాజా, డి.రామానాయుడు, కృష్ణంరాజు, శ్రీకాంత్, కోడిరామకృష్ణ, కైకాల సత్యనారాయణ, బాలయ్య, బ్రహ్మానందం, గిరిబాబు, మురళీమోహన్, జొన్నవిత్తుల, ఎం.ఎల్.కుమార్‌చౌదరి, సాగర్, బద్రీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

శ్రీరాముడు రాజుగా పాలించిన ఘట్టమే ప్రధాన కథాంశమైన ఈ చిత్రానికి పాటలు: జొన్నవిత్తుల, వెన్నెలకంటి, సినిమాటోగ్రఫీ:పి.ఆర్.కె. రాజు, కూర్పు: జి.జి. కృష్ణారావు, కళ: రవీంద్ర, గ్రాఫిక్స్: కమల్ కణ్ణన్, డాన్స్: శ్రీను, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: తాండవ కృష్ణ, స్క్రీన్‌ప్లే, మాటలు: ముళ్లపూడి వెంకటరమణ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X