విద్యార్థులకు ‘శ్రీరామ రాజ్యం’ బంపర్ ఆఫర్
బాలయ్య నటించిన శ్రీరామ రాజ్యం సినిమా విజయ వంతంగా 50 రోజుల వేడుకకు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమా నిర్మాత యలమంచిలి సాయిబాబు 1 నుంచి 10వ తరగతి వరకు గల స్కూలు విద్యార్థులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. సోమవారం(డిసెంబర్ 26) నుంచి వారంలో ప్రతి నాలుగు రోజులు(సోమ, మంగళ, బుధ, గురు) టిక్కెట్ రేటులో సగం ధరకే సినిమా చేసే అవకాశం కల్పించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. పిల్లలు వారి స్కూలు యాజమాన్యాల ద్వారా వారి వారి ప్రదేశములలో ఉన్న థియేటర్ల యాజమాన్యాలను సంప్రదించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
రాముడిని దేవుడిగా ఎందుకు ఆరాధిస్తున్నామో నేటి యువతరానికి తెలియాలనే ఉద్దేశ్యంతోనే ఈచిత్రం నిర్మించడం జరిగిందని, ధర్మ పాలన, అన్నదమ్ముల అనురాగం, భార్య భర్తల అనుబంధం, పిల్లలు తల్లిదండ్రులను, పెద్దలను ఎలా గౌరవించాలో, మనిషన్నవాడు పాటించవలసిన మానవతా విలువలు, ఆచరించవలసిన నీతి, నియమాలు, నిబద్ధత...ఇలాంటివి ఎన్నో రాముడిలో మనం చూస్తాం. ఆ విలువల్ని, వ్యక్తిత్వాన్ని నేటి యువతరం ఈ సినిమా ద్వారా చూసి తెలుసుకోవాలని, వాటిని అలవరచుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులు గమనించి పిల్లలను ఈ సినిమా చూసే దిశగా ప్రోత్సహించాలని కోరారు.


Click it and Unblock the Notifications











