బాలయ్య ‘శ్రీరామ రాజ్యం’ హిందీ పోస్టర్...
హైదరాబాద్ : బాలయ్య నటించిన 'శ్రీరామ రాజ్యం' చిత్రాన్ని ఆ చిత్ర నిర్మాత సాయి బాబు ఇప్పటికే ఇతర దక్షిణాది భాషల్లోనూ విడుదల చేసి మంచి ఫలితాలు సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా 'శ్రీరామ రాజ్యం' చిత్రాన్ని హిందీలోకి అనువదిస్తున్నారు. ఇటీవలే బాలయ్య తన పాత్రకు డబ్బింగ్ చెప్పడం కూడా పూర్తి చేసారు. తాజాగా ఆ సినిమాకు సంబంధించిన పోస్ట్ కూడా విడుదలైంది. త్వరలోనే ఈచిత్రం హిందీలో విడుదల కానుంది.
బాపు దర్శకత్వంతో పాటు, ఈ చిత్రానికి ఇళయరాజా అందించిన సంగీతం, బాలయ్య, నయనతార పెర్ఫార్మెన్స్ బాలీవుడ్ ప్రేక్షకులను కూడా మెప్పిస్తుందని, సినిమా అక్కడ మంచి ఫలితాలు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. బాలకృష్ణ ఇప్పటి వరకు అధికారికంగా ఏ సినిమాకు కమిట్ కాలేదు. అయితే అనధికారికంగా మాత్రం ఆయన త్వరలో సింగితం శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందబోయే 'ఆదిత్య 999' చిత్రానికి కమిట్ అయ్యారని పుకార్లు వినిపిస్తున్నాయి.
బాలయ్య సినీ వారసుడుగా ఆయన తనయుడు మోక్షజ్ఞ ఇండస్ట్రీకి పరిచయం కావడానికి రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ కొంత కాలంగా ఇదే విషయమై సీరియస్ గా కసరత్తు చేస్తున్నాడు. బాలయ్య 100వ సినిమా 'మోక్షజ్ఞ' తొలి సినిమాగా ప్లాన్ చేస్తున్నారని, ఈ చిత్రంలో బాలయ్య అతిథి పాత్ర చేయడం ద్వారా తన కొడుకు హీరోగా రూపొందబోయే తొలి సినిమాపై అంచనాలు పెంచేలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











