ఈ కమర్షియల్ జనరేషన్ లో ఆ జనరేష్ సినిమా చూపించిన బాపుకి హాట్సాఫ్...!
తెలుగు సినీ ప్రియులకు బాగా నచ్చిన సినిమాల్లో 'మాయాబజార్' మొదటి పీఠిన ఉంటుంది. నాటి నుంచీ నేటి వరకూ ఎక్కడ, ఎప్పుడు విడుదలైనా ప్రేక్షకాదరణ చూరగొంటోంది. నలుపు-తెలుపు నుంచి కలర్ లోకి మార్చి, ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తే, మరోమారు ఆదరించారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకున్న నిర్మాత యలమంచలి సాయిబాబు 'లవకుశ' చిత్రాన్ని మరోమారు తీయాలని తపించారు. 1963లో ఎన్టీఆర్ తీసిన 'లవకుశ' గొప్ప విజయం సాధించింది. దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత దర్శకుడు బాపు, బాలకృష్ణతో 'శ్రీరామరాజ్యం' తీశారు. రొటీన్ ప్రేమకథలు, ఫ్యాక్షన్ స్టోరీలు వస్తున్న తరుణంలో 'శ్రీరామరాజ్యం' ఓ మధురమైన కథ. ఇళయరాజా సంగీతం మధురాతి మధురం.
కాగా శ్రీరామ రాజ్యం చిత్రం లవకుశ అని ముందే చెబితే తెలుగు ప్రేక్షకలు పెదాలు విరిచేస్తారని నిర్మాతుల భయం. అందుకే ఒక్క ఫోటో బయటికి రాకుండా మొత్తం షూట్ చేసేసారు. అసలు చిత్రంలో ఏముది? జనరంజకమైన పాలకుడుగా శ్రీరాముడు కొన్ని వేల సంవత్సరాలు ఏలినట్టు పురాణగాధ అయితే, పాలనను చూపుతారని అనుకున్నారంతా. తీరా ఉత్తర రామచరిత్రనే తీసారు. లోగడ ఎన్టీఆర్ వాల్మీకి, శ్రీరాముడుగా వేస్తూ ఉత్తరరామచరిత్రనే తీస్తానని ప్రకటించారు.
కానీ ఆకన తీయలేకపోయారు. ఇప్పుడు బాలకృష్ణతో నిర్మాతలు అత్యంత సాహసంతో లవకుశను తీసారు. తొలి ప్రదర్శనలు చూసిన ప్రేక్షకులు బాగానే ఉంది. అందులో బాపు తీయడంలో చాలా మెలుకువలతో తీసారు. చూడాలనిపించేలా ఉందని ప్రశంసించారు. సీత వేషం వేసిన నయనతార మరిన్ని మార్కులు కొట్టేసింది. సర్వత్ర ఆమె నటనకు నీరాజనాలు లభిస్తున్నాయి. ఇలా టాక్ రెండు వారాలుంటే పెద్ద హిట్ అవుతుంది. మళ్ళీ పౌరాణిక చిత్రాలు తీయడానికి పెద్ద అవకాశం ఏర్పడ్డట్టే...


Click it and Unblock the Notifications











