వెండితెర కావ్యం ('శ్రీరామ రాజ్యం' ప్రివ్యూ)

By Srikanya

'లవకుశ' రీమేక్ గా బాలకృష్ణ ప్రధానపాత్రలో బాపు దర్సకత్వంలో రూపొందిన శ్రీరామ రాజ్యం చిత్రం ఈ రోజు(గురువారం)విడుదల అవుతోంది. 'శ్రీకృష్ణార్జున విజయం'(1996) తర్వాత నందమూరి బాలకృష్ణ నుంచి వస్తున్న పౌరాణిక చిత్రం ఇదే కావటంతో మంచి అంచనాలే ఉన్నాయి. అందులోనూ నయనతార ఆఖరి చిత్రం అంటూ ప్రచారం జరగటం ఈ చిత్రానికి కలసి వచ్చే మరో అంశం. వీటికి తోడు గతంలో సీతా కళ్యాణం వంటి అద్బుతమైన చిత్రాలను తీసిన బాపు దర్శకత్వంలో రూపొందటం కూడా ఈ చిత్రంపై అందరిలో ఆసక్తి నెలకొనటానకి కారణమైంది.

ఉత్తరరామ చరిత్ర ఆధారంగా తండ్రీ కొడుకులు సి. పుల్లయ్య, సి.ఎస్. రావు దర్శకత్వంలో రూపొందిన 'లవకుశ'కు రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రం కథ రావణ సంహారం తరవాత శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చిన ఘట్టం నుంచి మొదలవుతుందీ చిత్రం. శ్రీరామ పట్టాభిషేకం, రాజధర్మం కోసం సీతను అడవులకు పంపడం, లవకుశుల జననం, రామగానం చేస్తూ ఆ సోదరులు అయోధ్యకు వెళ్లడం, ఆ తరవాత యాగాశ్వాన్ని బంధించి లక్ష్మణుడితోనూ, ఆ తరవాత రాముడితోనూ యుద్ధం చేయడం లాంటి ఘట్టాలతో ఈ చిత్రం సాగుతుంది.

చిత్ర నిర్మాత సాయిబాబు మాట్లాడుతూ.. ఈ పౌరాణిక చిత్రం తప్పకుండా ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. బాలకృష్ణ నటన, ఇళయరాజా సంగీతం ప్రధాన ఆకర్షణలు. బాపు ప్రతి సన్నివేశాన్నీ కనువిందు చేసేలా చిత్రించారు. ఇందుకోసం ప్రత్యేకంగా రామోజీ ఫిల్మ్‌సిటీలో సెట్స్‌ని నిర్మించాం. అలాగే విజువల్‌ ఎఫెక్ట్స్‌ కథకు బలాన్నిచ్చాయన్నారు.

సంస్థ: శ్రీసాయిబాబా మూవీస్‌
తారాగణం: బాలకృష్ణ, నయనతార, అక్కినేని నాగేశ్వరరావు, మాస్టర్‌ గౌరవ్‌, మాస్టర్‌ ధనుష్‌కుమార్‌, శ్రీకాంత్‌, సమీర్‌, కె.ఆర్‌.విజయ, వింధు దారాసింగ్‌, బాలయ్య, బ్రహ్మానందం తదితరులు.
సంగీతం: ఇళయరాజా
నిర్మాత: యలమంచిలి సాయిబాబు
దర్శకత్వం: బాపు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X