బాలయ్య బాబూ...కనీసం ఈసారైనా?
బాలయ్య హీరోగా వస్తున్న తాజా సినిమా శ్రీరామరాజ్యం విడుదల తేదీ ఎట్టకేలక ఖరారైంది. నవంబర్ 17 సినిమాను విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్మాత యలమంచిలి సాయిబాబు వెల్లడించినట్లు సమాచారం. దర్శకుడు బాపు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో బాలయ్య సరసన నయనతార లీడ్ రోల్ చేస్తోంది. బాలయ్య రాముడి పాత్రలో, నయనతార సీత పాత్రలో దర్శనం ఇవ్వనున్నారు. పౌరాణిక కథాంశం నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది.
ఈ సినిమా ఆడియో ఆగస్టు 15నే విడుదలయింది. అదే నెలలో సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. దసరా సందర్భంగా సినిమాను విడుదల చేద్దామనుకున్నారు. కొన్ని కారణాల వల్ల విడుదల కాలేదు. మళ్లీ దీపావళి కానుకగా నవంబర్ 26న విడుదల చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. పోస్టు ప్రొడక్షన్ పనులు పూర్తి కాని కారణంగా నవంబర్ 10కి వాయిదే వేశారు. అప్పటికీ పనులు పూర్తి కాక పోవడంతో నవంబర్ 17 డేట్ ను ఫిక్స్ చేశారు. అయితే కనీసం ఈ సారైన వాయిదా పండకుండా ఉంటుందా? బాలయ్య బాబూ అంటూ అభిమానులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











