'శ్రీరామ రాజ్యం' విడుదల వాయిదా

By Srikanya

బాపు, బాలకృష్ణల కాంబినేషన్ లో రూపొందిన 'శ్రీరామ రాజ్యం'చిత్రాన్ని సెప్టెంబర్ 16 న విడుదల చేయటానికి నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే.అయితే ఇప్పుడా రిలిజ్ డేట్ ని ఛేంజ్ చేసారు.దసరా రోజున అంటే అక్టోబర్ ఆరవ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.దానికి కారణం గ్రాఫిక్స్ వర్క్ ఇంకా పూర్తి కాకపోవటమేనని తెలుస్తోంది.ఇక వారం క్రితం విడుదలైన శ్రీరామరాజ్యం ఆడియో మార్కెట్లో మంచి క్రేజ్ తెచ్చుకుంది.

గతంలో రామారావు గారు నటించిన లవకుశ కళాఖండాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ దృశ్య కావ్యాన్ని తెరకెక్కించారు. శ్రీరాముని జననం నుంచి రావణాసుర సంహారం వరకూ పదినిషాల పాటలో ఆ కథంతా ఉంటుంది. ఇప్పటికీ భారతావని అంతా రామరాజ్యం రావాలి అంటూ అనుకుంటూ ఉంటుంది. ఆ రామరాజ్యం ఎలా ఉండేది. రాముని విశిష్టత ఏమిటి.. అన్న విశేషమే శ్రీరామ రాజ్యం అని నిర్మాతలు చెప్తున్నారు.

ఈ చిత్రంలో శ్రీరామునిగా బాలకృష్ణ, సీతగా నయనతార చేస్తున్నారు. శ్రీ సాయిబాబా మూవీస్ పతాకంపై యలమంచిలి సాయిబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముళ్లపూడి వెంకటరమణ రచన చేస్తున్నారు. ఇళయరాజా సంగీతం సమకూరుస్తున్నారు. శ్రీరాముడు రాజుగా పాలించిన ఘట్టమే ఈ చిత్రానికి ప్రధాన కథాంశం. ఈ చిత్రానికి పాటలు: జొన్నవిత్తుల, వెన్నెలకంటి, సినిమాటోగ్రఫీ:పి.ఆర్.కె. రాజు, కూర్పు: జి.జి. కృష్ణారావు, కళ: రవీంద్ర, గ్రాఫిక్స్: కమల్ కణ్ణన్, డాన్స్: శ్రీను, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: తాండవ కృష్ణ, స్క్రీన్‌ప్లే, మాటలు: ముళ్లపూడి వెంకటరమణ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X