ఈ ఏడు ఏకంగా 8 నంది అవార్డులు దక్కించుకోనున్న ‘శ్రీరామ రాజ్యం’..!
బాలకృష్ణ రాముడుగా, నయనతార సీతగా నటించిన శ్రీరామ రాజ్యం" విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది. వసూళ్ళు కూడా బాగుండటంతో తమ పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కిందని ఈ యూనిట్ సభ్యలు భావిస్తున్నారు. శ్రీరామరాజ్యం చిత్రానికి లభిస్తున్న ఆదరణ హీరో నందమూరి బాలకృష్ణను ఉత్సాహపరుస్తోంది. ఈ చిత్రం ఇచ్చిన స్ఫూర్తితో మరిన్ని పౌరాణిక చిత్రాలు చేయడానికి ఆయన సిద్ధపడుతున్నారు. ఇలాంటి చిత్రాలు నిర్మించడానికి ఎవరైనా ముందుకు వస్తే కనుక తాను ఆనందంగా అంగీకరిస్తానని చెబుతున్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమాకి దాదాపు 8 అవార్డులు దక్కే అవకాశముందని, ఈ యేడాది అవార్డులన్నీ బెస్ట్ యాక్టర్స్, బెస్ట్ సినిమాటోగ్రఫీ, బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, బెస్ట్ లిరిక్స్, బెస్ట్ గ్రాఫిక్స్ తదితర విబాగాల్లో ఈ సినిమా అవార్డులు దక్కించుకోవడం ఖాయమని సినీ ప్రేక్షకులు అంచనాలు అప్పుడు మొదలెట్టేశారు..కాగా 'శ్రీరామరాజ్యం' చిత్రాన్ని బాపు అద్భుతంగా మలచారనీ, అందుకే ఇంతటి ఆదరణ లభిస్తోందనీ బాలకృష్ణ అన్నారు.


Click it and Unblock the Notifications











