బాలయ్య ‘శ్రీరామ రాజ్యం’ దేశ వ్యాప్తంగా..!

ఇంతటితో ఆగకుండా ఈ సినిమాను హిందీ, ఇంగ్లీష్ లలో కూడా అనువదించి దేశం మొత్తం ఈ సినిమాను మార్కెట్ చేయాలని చూస్తున్నారు నిర్మాత. అదే జరిగితే ఈ సినిమాలకు దర్శకత్వం వహించిన బాపు పేరు, బాలకృష్ణ, నయనతారల పేర్లు దేశం మొత్తం మారుమ్రోగనున్నాయి.
ప్రస్తుతం బాలయ్య అధినాయకుడు చిత్రంలో నటిస్తున్నాడు. బాలయ్య ఈ చిత్రంలో మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారు. ముసలాయన పాత్రలో, తండ్రి పాత్రలో , కొడుకు పాత్రలో నటిస్తున్నాడు. బాలయ్యకు జోడీగా లక్ష్మిరాయ్, సలోనిలు నటిస్తున్నా. పరుచూరి మురళి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఎంఎల్ కుమార్ చౌదరి కీర్తీ కంబైన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కళ్యాణి మాలిక్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఫిబ్రవరి నెలలోనే ఈ చిత్రం ఆడియో విడుదల కానుంది. ఈ సినిమాను మార్చి 23న విడుదల చేయాలని నిర్మాతలు తాజాగా నిర్ణయించారు.


Click it and Unblock the Notifications











