పుస్తక రూపంలో‘శ్రీరామ రాజ్యం’స్క్రిప్టు
బాలయ్య నటించిన 'శ్రీరామ రాజ్యం"సినిమా విజయ వంతంగా 100 రోజుల వేడుకకు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమా నిర్మాత యలమంచిలి సాయిబాబు ఈ చిత్రం స్క్రిప్టుని యధాతదంగా అంటే సినిమా కోసం ఎడిట్ చేసిన వెర్షన్ కాకుండా పుస్తక రూపంలో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ పుస్తకాన్ని వాహిని బుక్ ట్రస్ట్ విడుదల చేస్తోంది. దాదాపు నాలుగు వందల పేజీలతో రాబోతున్న ఈ పుస్తకంలో బాపూ ఈ చిత్రం కోసం గీసిన స్టోరీ బోర్డ్ తో సైతం ఉండబోతోంది. ఈ పుస్తకం పిబ్రవరి 23న మార్కెట్లో విడుదల అవుతుంది.
అదే రోజు ముళ్లపూడి వెంకట రమణగారి ప్రధమ వర్దంతి కూడా. అదే రోజు శ్రీరామరాజ్యం చిత్రం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఇక రాముడిని దేవుడిగా ఎందుకు ఆరాధిస్తున్నామో నేటి యువతరానికి తెలియాలనే ఉద్దేశ్యంతోనే ఈచిత్రం నిర్మించడం జరిగిందని, ధర్మ పాలన, అన్నదమ్ముల అనురాగం, భార్య భర్తల అనుబంధం, పిల్లలు తల్లిదండ్రులను, పెద్దలను ఎలా గౌరవించాలో, మనిషన్నవాడు పాటించవలసిన మానవతా విలువలు, ఆచరించవలసిన నీతి, నియమాలు, నిబద్ధత...ఇలాంటివి ఎన్నో రాముడిలో మనం చూస్తాం. ఆ విలువల్ని, వ్యక్తిత్వాన్ని నేటి యువతరం ఈ సినిమా ద్వారా చూసి తెలుసుకోవాలని, వాటిని అలవరచుకోవాలని నిర్మాత ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.


Click it and Unblock the Notifications











