For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  శ్రావణి చాలా అమాయకురాలు.. కడుపు రగిలిపోతోంది.... శ్రీ రెడ్డి సంచలన కామెంట్స్

  |

  రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నటి శ్రావణి ఆత్మహత్య కేసుపై శ్రీ రెడ్డి స్పందించింది. గతవారం రోజులుగా సీరియల్ నటి శ్రావణి వార్తలు చూస్తున్నాను. ఆమె చాలా అందంగా ఉంది. గోదావరి పిల్ల.. నా మనసు కలిచి వేసింది. ఈ విషయం గురించి మాట్లాడాలని రెండ్రోజుల నుంచి అనుకుంటున్నాను. ఇది ఆలస్యమైనందుకు సారీ. శ్రావణి ఒక అమాయకురాలు అని అర్థమైపోతోంది. ఎమోషన్స్‌కు బలైందని తెలిసిపోతోంది. ఈ సాయి, దేవరాజ్.. అబ్బాయిల మనస్తత్వం.. ప్రేమ కనబడుతోంది.. మిస్ అండర్ స్టాండింగ్ వల్లే అమ్మాయి చనిపోయినట్టు తెలుస్తోంది అని చెబుతూ శ్రీ రెడ్డి వీడియోను షేర్ చేసింది. ఇంకా ఆ వీడియోలో ఏం చెప్పిందంటే..

  ఒక మనిషి లేకపోతే బతకలేమా?

  ఒక మనిషి లేకపోతే బతకలేమా?

  అమ్మాయిలకు నేను ఇచ్చే సలహా ఏంటంటే..ఈ కేసును నేను పెద్దగా విడమరిచి చెప్పనవసరం లేదు.. మీరంతా ఫాలో అవుతుంటారు.. నా దృష్టిలో ఒకటే. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే..అబ్బాయిలు నో చెబితే మనం ఎందుకు చనిపోవాలి.. ఎందుకంత ఎమోషనల్‌గా వీక్‌గా ఉంటున్నారు.. ఒక మనిషి లేకపోతే బతకలేమా? పుట్టేటప్పుడు పది మందిని పట్టుకొచ్చామా? ఒంటరిగానే కదా పుట్టాం.. చనిపోయేటప్పుడు ఒంటరిగానే కదా పోతాం అని శ్రీరెడ్డి పేర్కొంది.

   ప్రాక్టికల్‌గా ఉండండి..

  ప్రాక్టికల్‌గా ఉండండి..

  సంసారమనేది రెండు బండి చక్రాల్లాంటిది.. ఓ మనిషికి ఇష్టం లేకపోతే కాపురం చేయలేం.. పెళ్లికి ముందే అలాంటి వారి తప్పుకుంటే అదృష్టంగా ఫీలవ్వండి.. పెళ్లాయ్యాక టార్చర్ పెట్టడం, పిల్లలు పుట్టాక భరించడం..అప్పుడు ఎటూ పోలేని పరిస్థితుల్లో మీరు ఇరుక్కుపోతారు.. అందుకే ధైర్యంగా ఉండండి.. ఇలా ఆత్మహత్యలు చేసుకోకండి..ఇది అందరూ ఇచ్చే సలహానే ఇది.. ఒక మనిషి లేకపోతే బతకలేం.. జీవతం లేదు..అలాంటివన్నీ అవాస్తవాలు.. కలల్లో బతక్కండి.. ప్రాక్టికల్‌గా ఉండండి.. అని శ్రీ రెడ్డి సలహా ఇచ్చింది.

  ఎందుకు చచ్చిపోతున్నారు..

  ఎందుకు చచ్చిపోతున్నారు..

  ప్రతీ దానికి ప్లాన్ ఏ ప్లాన్ బీ ప్లాన్ సీ అని ఉంటుంది..మీరెప్పుడూ కుంచిత స్వభావంతో ఉండకండి.. నా భర్త నా పిల్లలు నా ఫ్యామిలీ అని ఉండకుండా నలుగురికి ఉపయోగపడాలి. కట్టెకాలే వరకు ఎంతో మందికి ఆదర్శప్రాయంగా బతుకు బతకాలి.. ఎందుకు ఉరి వేసుకుంటున్నారు.. ఎందుకు చచ్చిపోతున్నారు.. ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఆ ధైర్యాన్ని మీరు బతకడంలో ఎందుకు పెట్టడం లేదో అర్థం కావడం లేదు. ఒక నిండు ప్రాణం పోయింది వారి అమ్మనాన్నలకు ఎంత లోటు.. వాళ్లు బతికి ఉన్నంత సేపు ఆ అమ్మాయి ఫోటో చూస్తూ బతకాల్సి వస్తుంది.. అని శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది.

   కడుపు రగిలిపోతోంది..

  కడుపు రగిలిపోతోంది..

  పరువు హత్యలను కూడా నేను ఎట్టి పరిస్థితుల్లో సమర్థించను.. నాకు చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉంది.. రెడ్లలో పుట్టి.. రెడ్ల పరువు తీసేశారు. సాయి అవ్వొచ్చు.. దేవరాజ్ అవ్వొచ్చు.. ఈ కమ్యూనిటీలో పుట్టినందుకు చావండి.. ఒక అమ్మాయి మీ గురించి చచ్చిపోయింది మీరు చచ్చిపోతే బెటర్.. మిమ్మల్ని కూడా ఎన్ కౌంటర్ చేసి చంపేస్తే బెటర్. ఎందుకంటే ఆ అమ్మాయికి అంతా టార్చర్ పెట్టారు.. ఫోన్ కాల్స్ చూస్తుంటే నాకు కడుపు రగిలిపోతోంది.. పెళ్లి చేసుకుంటానంటాడు. ఆ అమ్మాయి వీడికి ఎంత సాయం చేసింది. కనీసం విశ్వాసం లేదా? సాయి అనేవాడు అప్పుడు ఎందుకు గొడవ పడ్డాడు మళ్లీ ఎందుకు వచ్చాడు..

  #Watch : Hero Vishal Explains How He Was Cured From Corona
  ఎన్నుకునే ముందు

  ఎన్నుకునే ముందు


  చీ ఇలాంటి వాటి గురించి మాట్లాడటం కన్నా అమ్మాయిలకు నేను ఇచ్చే సలహా ఏంటంటే.. ఓ జీన్స్ పాయింట్‌ను సెలెక్ట్ చేసుకునే ముందు ఏ బ్రాండ్.. ఎంత.. బాగా మన్నుతుందా?. లేదా? అని వంద సార్లు ఆలోచిస్తుంటాం.. హెయిర్ బ్యాండ్ కొనుక్కోవడానికి కూడా వంద సార్లు ఆలోచిస్తాం.. అంత విలువ ఉంటుందా? దీనికి అని. గంటల తరబడి మన టైంను షాపింగ్ మాల్‌లో పెడతాం. మనం సెలెక్ట్ చేసుకునే ఓ బాయ్ ఫ్రెండ్ అవ్వొచ్చు భర్త అవ్వొచ్చు..జీవిత భాగస్వామిని ఎన్నుకునే ముందు సరైన శ్రద్ద పెట్టి ఇతను కరెక్ట్ అని అనుకున్నప్పుడే నిర్ణయాలు తీసుకోండి. అప్పటి వరకు ఇలా నిర్ణయాలు తీసుకుని మీ జీవితాలను పాడు చేసుకోవద్దు..

  English summary
  Sri Reddy About Actress Sravani Suicide Case, Sri Reddy Released A Video That Telss About Sravani Case HSe Syas That Sravani Look Like An Innocent Lady.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X