వారి అసలు రంగును బయటపెడతా.. ‘బిగ్‌బాస్’పై శ్రీ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
ప్రస్తుతం బిగ్‌బాస్ తెలుగు నాల్గో సీజన్ మెల్లిమెల్లిగా పుంజుకుంటోంది. మొదటి నుంచి కంటెస్టెంట్ల విషయంలో పెదివి విరిచిన ప్రేక్షకులు మెల్లిగా అలవాటు పడుతున్నారు. మొదటి రెండు రోజులు ఏడుపులు పెడబొబ్బులతోనే కాలం గడిచిపోయింది. కరాటే కళ్యాణి, మోనాల్ ఏడుపులతో హౌస్ అంతా గందరగోళంగా మారింది. ఇక ఇప్పుడిప్పుడే కాస్త ఎంటర్టైన్మెంట్ దిశగా నడుస్తున్నట్టు కనిపిస్తోంది. తాజాగా బిగ్‌బాస్ షోపై శ్రీ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.

మొదటి నుంచి కాంట్రవర్సీనే..
బిగ్‌బాస్ షోకు , శ్రీరెడ్డికి ఏదో ఓ అవినాభావ సంబంధం ఉన్నట్టు కనిపిస్తోంది. బిగ్‌బాస్ షోలోకి శ్రీరెడ్డి వస్తే టీఆర్పీలు మోతమోగడం ఖాయమని అందరికీ తెలిసిందే. ఆమె ఒక వేళ షోలో ఉంటే.. ఆమె నోటిని ఎవ్వరూ కంట్రోల్ చేయలేరు. ఇక ఆమె నోరు విప్పితే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అందుకే నిర్వాహకులు సైతం శ్రీరెడ్డిని లెక్కలోకి తీసుకోరు.

శ్రీరెడ్డి వ్యతిరేకవర్గం..
శ్రీరెడ్డితో గొడవలు పెట్టుకుకే వారిని మాత్రం బిగ్‌బాస్ ఆహ్వానిస్తాడు. అందులో భాగంగానే మూడో సీజన్‌లో తమన్నా సింహాద్రి, నాల్గో సీజన్‌లో కరాటే కళ్యాణిని తీసుకొచ్చాడు. ఇక ఇప్పటికే కరాటే కళ్యాణి షోలో చేసే ఓవరాక్షన్ అందరం చూస్తూనే ఉన్నాం. అయిందానికి కానిదానికి ఓవర్ రియాక్ట్ అవుతూ.. ఏడుస్తూ నానా రచ్చ చేస్తోంది.

తాజాగా లైవ్‌లో..
శ్రీరెడ్డి తాజాగా లైవ్‌లో మాట్లాడుతూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. మాధవీలత, సజ్జనార్, సోనూసూద్ ఇలా ఎన్నో అంశాలపై మాట్లాడింది. అందులో భాగంగానే బిగ్‌బాస్ షో, కంటెస్టెంట్లపై తీవ్ర ఆరోపణలు చేసింది. తనకు అసలు బిగ్‌బాస్ షో అంటేనే నచ్చదని తెగేసి చెప్పింది. అంతేకాకుండా కంటెస్టెంట్ల ఎమోషన్ల మీదా సెటైర్ వేసింది.

అసలు రంగు బయటకు తీసుకొస్తా..
బిగ్‌బాస్‌లో ప్రస్తుతం అందరివీ ఫేక్ ఎమోషన్స్ అని ఆరోపించింది. అందరూ నటిస్తున్నారని తెలిపింది. ఒకవేళ తాను బిగ్‌బాస్ హౌస్‌లో ఉండి ఉంటే.. ఆ అందరూ అసలు స్వరూపాలను బయటకు తీసుకొచ్చేదాన్ని, ఫేక్ ఎమోషన్స్ కాకుండా రియల్ ఎమోషన్స్‌ను అందరికీ చూపించేదాన్ని అంటూ చెప్పుకొచ్చింది. అయితే మరి శ్రీ రెడ్డిని బిగ్‌బాస్ ఆహ్వానిస్తాడా? లేదా అన్నది చూడాలి.


Click it and Unblock the Notifications











