శ్రీరెడ్డి సంచలనం: చికాగో సెక్స్ రాకెట్లో తెలుగు హీరోయిన్లు, యాంకర్లు!
Recommended Video

అమెరికాలోని చికాగో కేంద్రంగా తెలుగు దంపతులు రన్ చేస్తున్న వ్యభిచారం గుట్టు రట్టయిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో సినీ నిర్మాత కిషన్ మోదుగుమూడి, అతడి భార్య చంద్రను యూఎస్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ వ్యవహారంపై నటి శ్రీరెడ్డి స్పందించారు. ఈ వ్యవహారంలో పలువురు పెద్ద హీరోయిన్లు, యాంకర్లు, చిన్న చిన్న స్టార్స్ కూడా ఉన్నట్లు శ్రీరెడ్డి తెలిపారు. త్వరలోనే అందరి జాతకాలు బయటకొస్తాయన్నారు.

నన్ను కూడా ఈ రొంపిలోకి దించాలనుకున్నారు
సెక్స్ రాకెట్ రన్ చేస్తున్న కిషన్, చంద్ర దంపతులు తనను కూడా ఈ రొంపిలోకి దించాలని ప్రయత్నించారని, అయితే తాను అందుకు అంగీకరించలేదని, వారు రక్తం తాగే జలగల్లాంటి వారు అంటూ శ్రీరెడ్డి వ్యాఖ్యానించారు.

వెయ్యి నుండి పది వేల డాలర్లు
అమెరికాలో ప్రోగ్రామ్స్ పేరుతో.... వీసా, ఇతర ఏర్పాట్లు చేస్తారని..... సెక్స్ రాకెట్లో భాగం అయినందుకు ఆయా స్టార్స్ పాపులారిటీని బట్టి వెయ్యి డాలర్ల నుండి పదివేల డాలర్ల వరకు చెల్లిస్తారని శ్రీరెడ్డి తెలిపారు.

పతివ్రతల ముసుగులో...
పతివ్రతల ముసుగులో నా మీద, నేను చేస్తున్న కాస్టింగ్ కౌచ్ ప్రొటెస్ట్ మీద వ్యతిరేకంగా మాట్లాడిన కొంత మంది నటీమణుల జాతకాలు తొందరలోనే బయటకు వస్తాయి. అమ్మాయిలను వేధించుకుతిన్న వారికి కఠిన శిక్ష పడాలి. ఈ సెక్స్ రాకెట్లో నేను లేను అని గర్వంగా చెప్పుకుంటున్నాను... అని శ్రీరెడ్డి వ్యాఖ్యానించారు.

హీరోయిన్ సంజన గల్రాణి
చికాగో సెక్స్ రాకెట్ గురించి హీరోయిన్ సంజన కూడా స్పందించారు. ఈవెంట్ల పేరుతో అమెరికాకు హీరోయిన్లను, నటీమణులను రప్పించడం కొత్తేమీ కాదు. అయితే అందులో కొందరు సి, డి గ్రేడ్ ఆర్టిస్టులు ఈ వ్యభిచార ఉచ్చులో చిక్కుకుంటున్నారు. కొందరు డబ్బు ఆశపడి ఇలా చేస్తుంటారు, కొందరిని బలవంతంగా వ్యభిచారంలోకి లాగుతున్నారు' అని తెలిపారు.

లోతుగా పరిశోధన జరుపుతున్న అమెరికా పోలీసులు
కిషన్ మోదుగుమూడి అలియాస్ శ్రీరాజ్ చొన్నుపాటి (34), అతడి భార్య చంద్ర(31)లను అరెస్టు చేసిన చికిగో పోలీసులు 42 పేజీల చార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ కేసులో కన్నడ, తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ఐదురుగురు బాధితులను పోలీసులు గుర్తించారు. ఆ స్టార్స్ పేరు మాత్రం ఇప్పటి వరకు బయటకు రాలేదు.


Click it and Unblock the Notifications











