2020లో నా ఫ్రెష్ బాయ్‌ఫ్రెండ్.. కాబోయే మొగుడు.. శ్రీ రెడ్డి పిక్స్ వైరల్
శ్రీ రెడ్డి గురించి టాలీవుడ్, కోలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమే అక్కర్లేదు. టాలీవుడ్ బడా ఫ్యామిలీపై సంచలన ఆరోపణలు చేసిన శ్రీ రెడ్డి.. రాఘవ లారెన్స్, విశాల్ వంటి వారిని టార్గెట్ చేసి కోలీవుడ్‌లోనూ ఫేమస్ అయింది. ఒకప్పుడు మీటూ, క్యాస్టింగ్ కౌచ్ అంటూ తెలుగు చిత్ర సీమలో పోరాటాన్ని కొనసాగించింది. ఫిల్మ్ ఛాంబర్ ముందు అర్దనగ్న ప్రదర్శన, పవన్ కళ్యాణ్‌పై పరుష పదజాలాన్ని ప్రయోగించడం వంటివి చేయడంతో మీడియా కూడా పక్కన పెట్టేసింది. దీంతో ఆమె కోలీవుడ్ వెళ్లి సెటిలైంది.
Recommended Video

సోషల్ మీడియాలో రచ్చ..
శ్రీ రెడ్డి సోషల్ మీడియాలో చేసే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంత ఘాటు పదాలతో పోస్ట్ చేస్తుందో.. అంతే హాటు ఫోటోలను కూడా షేర్ చేస్తుంది. ఇలా పోస్ట్‌లు, ఫోటోలతో నెటిజన్లను ఆకట్టుకుంటుంది శ్రీరెడ్డి. సినీ రాజకీయ అంశాలపై నిత్యం ఏదో ఒక కామెంట్ చేస్తూనే ఉంటుంది.

మెగా ఫ్యామిలీపై..
శ్రీ రెడ్డి నిత్యం మెగా ఫ్యామిలీపై ఏదో ఒక కామెంట్ చేస్తూనే ఉంటుంది. పవన్ కళ్యాణ్‌ను సినీ, రాజకీయ అంశాలపై టార్గెట్ చేస్తుంది. నాగబాబును అయితే మరీ ఘోరంగా పరుష పదజాలంతో ఆడిపోసుకుంటూ ఉంటుంది. మెగా ఫ్యాన్స్, శ్రీరెడ్డికి సోషల్ మీడియాలో మాటల యుద్దం జరుగుతూనే ఉంటుంది.

దగ్గుబాటి ఫ్యామిలీపై..
శ్రీ రెడ్డికి దగ్గుబాటి ఫ్యామిలీకి ఉన్న సంబంధం అందరికీ తెలిసిందే. దగ్గుబాటి అభిరామ్‌తో ఉన్న ప్రైవేట్ ఫోటోలు లీక్ చేయడం, మోసం చేశాడంటూ ఆరోపణలు చేయడం వంటివి చేస్తూ సంచలనం సృష్టించింది. ఈ మధ్యే రానా బావా పెళ్లి అంటూ ఓ వీడియోను షేర్ చేసింది. అందులో అభిరాంపైనా సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.

కొత్త బాయ్ ఫ్రెండ్
ఇక తాజాగా ఈ ఏడాదిలో కొత్త బాయ్ ఫ్రెండ్ అంటూ ఒకరిని పరిచయం చేసింది శ్రీ రెడ్డి. తనకు కాబోయే భర్త అంటూ మొదటి సారి స్క్రీన్‌కు పరిచయం చేసింది. మరో పోస్ట్ చేస్తూ తన సోదరులు, భర్తను కూడా చూపెట్టింది. అయితే ఇదంతా నిజం కాదని, ఏదో సినిమా కోసమై ఉంటుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. గతంలోనూ శ్రీ రెడ్డి తనకు ఓ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంటూ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











