twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘మా’ వివాదం: నరేష్ ఇష్యూతో తెరపైకి శ్రీరెడ్డి, ఆడ పిల్లలను కాల్చుకుతినే బ్రోకర్స్ అంటూ..

    By Bojja Kumar
    |

    Recommended Video

    Naresh Speaks On Sri Reddy Controversy

    మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ (మా) నిధుల అవకతవకల అనుమానంతో మా అధ్యక్షుడు శివాజీరాజాపై సీనియర్ నటుడు నరేష్ మీడియా ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన శివాజీ రాజా నేతృత్వంతో గతంలో శ్రీరెడ్డి విషయంలో 'మా' ప్రవర్తించిన తీరును తప్పుబట్టారు. శ్రీరెడ్డి వ్యవహారంపై 'మా' తీరు సరికాదని, ఈ విషయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకొన్నామని, 'మా' ప్రతిష్ఠ దిగజార్చుకున్నామని నరేష్ అన్నారు. ఈనేపథ్యంలో శ్రీరెడ్డి రియాక్ట్ అయ్యారు.

    ఆ ఇద్దరికీ గోచీ ఊడింది

    ఆ ఇద్దరికీ గోచీ ఊడింది

    ‘నేను పోరాటం చేస్తే పబ్లిసిటీ స్టంట్ అని చెప్పిన శివాజీ రాజాకి, శ్రీకాంత్‌కి గోచి ఊడి దరిద్రపు గతి పట్టింది. మోసపోయి నేనొస్తే ఓదార్చాల్సింది పోయి బడా ఫ్యామిలీస్‌ని కాపాడే ప్రయత్నం చేశారు.' అని శ్రీరెడ్డి అన్నారు.

    నాకు డబ్బివ్వాలని చూశారు

    నాకు డబ్బివ్వాలని చూశారు

    నాకు కోట్ల రూపాయలు ఇవ్వాలని శివాజీ రాజా అతడి తొత్తులు ప్రయత్నం చేస్తే నేను తీసుకోలేదు. వారు చేసిన పనికి నా కడుపు మండింది. నా విషయంలో శివాజీ రాజా బిహేవియర్ బాధాకరం.

    తల్లిదండ్రులనే చూడలేదు నువ్వు

    తల్లిదండ్రులనే చూడలేదు నువ్వు

    ఆడపిల్లని కాల్చుకు తినే బ్రోకర్స్ వీళ్లు. సెటిల్మెంట్స్ చేసే గుండాలు. తల్లిదండ్రులనే చూడలేని శివాజీ రాజా ముసలోళ్లకి వృద్దాశ్రమం గురించి అమెరికాలో గంతులేసారట.... నువ్వు చెప్పేవన్నీ అబద్దాలే.... అని శ్రీరెడ్డి ఫైర్ అయ్యారు.

    డబ్బంతా పంచుకుతిన్నారు

    డబ్బంతా పంచుకుతిన్నారు

    అందరూ తోడు దొంగలే. డబ్బంతా పంచుకుతిన్నారు. దీనికి బడా హీరో వాటా చాలా పెద్ద మొత్తం. అమెరికాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా నా వద్ద ఉంది. ఆడపిల్ల ఏడుపు ఉత్తినే పోదు. ఏడవనీ.. ఇంకా ఉంది ముసళ్ల పండగ, కీప్ ఇట్ అప్ నరేష్ గారు... అంటూ శ్రీరెడ్డి వ్యాఖ్యానించారు.

    English summary
    The Movie Artists Association is facing a lot of unnecessary rumors in the recent times. The association is facing allegations regarding the funds utilized for organizing the events in the USA. Regarding this issue, MAA president Sivaji Raja criticized by Sri Reddy.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X