విడాకులు తప్పు కాదు, అతడితో సంబంధం నేరం కాదు: శ్రీరెడ్డి
బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా తన భర్త అర్బాజ్ ఖాన్‌కు విడాకులు ఇచ్చిన తర్వాత యంగ్ హీరో అర్జున్ కపూర్‌తో ప్రేమాయణం కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
'గబ్బర్ సింగ్' సినిమాలో కెవ్వు కేక పాటతో టాలీవుడ్లో పాపులరైన ఈ ముంబై భామ లవ్వాయణం గురించి రకరకాలు చర్చించుకుంటున్నారు. వీరి 'సం'బంధంపై కొందరు విమర్శలు సైతం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీరెడ్డి ఈ జంటకు మద్దతు తెలిపారు.

రూల్స్ బ్రేక్ చేయండి
మలైకా అరోరా, అర్జున్ కపూర్ జంట ఎంతో క్యూట్‌గా ఉంది. ఈ సమాజం విధించిన అక్కరకురాని రూల్స్ బ్రేక్ చేసి మంచి పని చేశారు. మీ ఇష్టమైనట్లు సంతోషంగా జీవించడంలో తప్పు లేదు అని శ్రీరెడ్డి అన్నారు.

విడాకులు తప్పు కాదు, అతడితో సంబంధం నేరం కాదు
ఈ సమాజం గురించి మీరు బాధ పడొద్దు. మనం ఎలా ఉన్నా ఈ సమాజం మనల్ని బ్లేమ్ చేస్తూనే ఉంటుంది. విడాకులు తీసుకోవడం మిస్టేక్ కాదు, వయసులో చిన్నవాడితో రిలేషన్‌షిప్ పెట్టుకోవడం నేరం కాదు.... అంటూ మలైకాకు శ్రీరెడ్డి తన మద్దతు ప్రకటించారు.

నీకు సరైన సోల్‌మేట్ దొరికాడు
అర్జున్ కపూర్ రూపంలో నీకు సరైన సోల్‌మేట్ దొరికాడని భావిస్తున్నాను. మీ ఇద్దరికీ ఆల్ ది బెస్ట్. మీకు నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది, మీరు సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నాను అని శ్రీరెడ్డి తెలిపారు.

త్వరలో వివాహం
బాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం మలైకా అరోరా, అర్జున్ కపూర్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. ఇటీవల కరణ్ జోహార్ కూడా ఓ సందర్భంలో వీరి పెళ్లికి సంబంధించి పరోక్షంగా హింట్ ఇచ్చారు. 2019లో వీరి పెళ్లి జరుతుందని టాక్.

మరొకరితో మలైకా మాజీ భర్త
కాగా... విడాకుల తర్వాత మలైకా అరోరా మాజీ భర్త, సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్.... జార్జియా ఆండ్రియానితో ప్రేమాయణం మొదలు పెట్టారు. వీరు తరచూ బాలీవుడ్లో జరిగే ఫంక్షన్లకు జంటగా హాజరవుతున్నారు.


Click it and Unblock the Notifications











