twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అప్పుడు నన్ను నీచంగా... ఇప్పుడేమో ఇలా : పెద్ద హీరోయిన్ల తీరుపై శ్రీరెడ్డి

    |

    Recommended Video

    Sri Reddy Responds On #Metoo Campaign

    బాలీవుడ్ పరిశ్రమలో తనుశ్రీ దత్తా ఆరోపణలతో మొదలైన #మీటూ ఉద్యమం ఉధృతంగా మారి సౌత్ ఇండస్ట్రీకి సైతం విస్తరించిన సంగతి తెలిసిందే. ప్రముఖ నటుడు నానా పాటేకర్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని, లైంగికంగా వేధించాడని ఆమె చేసిన ఆరోపణలకు సంచలనం అయ్యాయి. పలువురు సెలబ్రిటీలు ఆమెకు మద్దతుగా నిలవడంతో పాటు తమకు ఎదురైన వేధింపుల అనుభవాలను #మీటూ ఉద్యమంలో భాగంగా వెల్లడిస్తూ ఇండస్ట్రీలో ఉన్న ప్రిడేటర్స్(సెక్సువల్ వేధింపులకు పాల్పడిన వ్యక్తులు) గురించి బయట పెడుతూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. ఈ పరిణామాలపై శ్రీరెడ్డి స్పందించారు.

    సమంత కూడా మద్దతు... లైంగిక వేధింపులకు సాక్ష్యాలా? సారీ...సమంత కూడా మద్దతు... లైంగిక వేధింపులకు సాక్ష్యాలా? సారీ...

    ఏదో ఒక రోజు ఇలా జరుగుతుందని తెలుసు

    ఏదో ఒక రోజు ఇలా జరుగుతుందని తెలుసు

    #మీటూ ఉద్యమంలో పాల్గొంటున్న మహిళలందరికీ ధన్యవాదాలు. వారి ధైర్యాన్ని ప్రతి ఒక్కరూ మెచ్చుకోవాలి. ఏదో ఒకరోజు వేధింపులకు గురైన మీరంతా ముందుకు వస్తారని తెలుసు. ఈ విషయం నేను ఎప్పుడో అంచనా వేశాను అని శ్రీరెడ్డి తెలిపారు.

    నేను మొదలు పెట్టినపుడు నీచంగా చూశారు

    నేను మొదలు పెట్టినపుడు నీచంగా చూశారు

    నేను #మీటూ ఉద్యమం మొదలు పెట్టినపుడు ఈ సమాజం, ఫ్యామిలీ, నా కోలీగ్స్ ఇలా ప్రతి ఒక్కరూ నన్ను చాలా నీచంగా చూశారు. ఆ సమయంలో నాకు ఎవరూ మద్దతు ఇవ్వడానికి ముందుకు రాలేదని శ్రీరెడ్డి అన్నారు.

    తెలుగు మీడియా కూడా దూరం

    తెలుగు మీడియా కూడా దూరం

    చివరకు తెలుగు మీడియా కూడా నన్ను దూరం పెట్టింది. కానీ ఇపుడు #మీటూ ఉద్యమం మహిళా ప్రపంచంలో ఒక విప్లవంగా మారింది. నేను మొదలు పెట్టినపుడే మద్దతు లభించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని శ్రీరెడ్డి తెలిపారు.

     పెద్ద హీరోయిన్లు అప్పుడలా, ఇప్పుడిలా

    పెద్ద హీరోయిన్లు అప్పుడలా, ఇప్పుడిలా

    నేను #మీటూ ఉద్యమం మొదలు పెట్టినపుడు సౌత్ సినీ ఇండస్ట్రీ నుండి ఏ ఒక్క పెద్ద హీరోయిన్ కూడా మద్దతుగా ముందుకు రాలేదు. ఇపుడు బాలీవుడ్లో #మీటూ ఉద్యమం మొదలవ్వగానే సపోర్ట్ చేయడం మొదలు పెట్టారు. ఏది ఏమైనా ఇదంతా కూడా ఒక మంచి పరిణామం అన శ్రీరెడ్డి అన్నారు.

    English summary
    "Good morning..Thanks to each n every woman who are participating in me too movement..I expected this wl happened one day..every one should appreciate the women guts..when I started me too movement, society nd colleagues nd family every one treated me so awful nd awkward,even telugu media ..now its became a revolution from the women world..more than that when I talked about this, single south Indian actress didnt support this..after Bollywood opened the doors for the sexual harassment big heroines started supporting,any how it's a good move.. #metoo." Sri Reddy tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X