twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హాట్ టాపిక్ : ఆ గాయం చచ్చేదాక వదలదు.. వేదాంత ధోరణిని ఎత్తుకున్న శ్రీరెడ్డి

    |

    శ్రీరెడ్డి గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ఆమె నటించిన సినిమాల కంటే ఆమె చేసిన ఆరోపణలు, లేవనెత్తిన ఉద్యమం, అర్ధనగ్న ప్రదర్శనలే ఫేమస్. వీటితోనే జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. అప్పటి వరకు ఓ దారిలో వెళ్తున్న శ్రీ రెడ్డి ఉద్యమం.. పవన్ కళ్యాణ్‌ను ధూషించడంతో మొత్తం మారిపోయింది. అక్కడి నుంచి మొత్తం స్వరూపమే మారిపోయింది. దగ్గుబాటి అభిరామ్‌పై చేసినవి ఆరోపణలుగానే మిగిలిపోయాయి. మొత్తంగా శ్రీ రెడ్డి చెన్నైలో సెటిల్ అవ్వడంతో వ్యవహారం అంతా ముగిసిపోయింది.

    సోషల్ మీడియా పోస్ట్‌లు..

    సోషల్ మీడియా పోస్ట్‌లు..

    అంత వరకు టీవీ చానెల్, యూట్యూబ్ చానెల్‌లో ఎక్కువగా కనిపించే శ్రీ రెడ్డి.. వాటివైపే చూడటం మానేసింది. తన అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారానే పంచుకుంటోంది. ఎవరినైనా ధూషించాలని అన్నా, పొగడాలని అన్నా ఫేస్‌బుక్ ‌పైనే ఆధార పడుతోంది. అందులోనే హల్చల్ చేస్తోంది.

    రెచ్చిపోయి పోస్ట్‌లు..

    రెచ్చిపోయి పోస్ట్‌లు..

    శ్రీ రెడ్డి చేసే పోస్ట్‌లు, వాడే పదజాలం, రాసే పద్దతిని కూడా ఎవ్వరూ తిరిగి వాడలేరు. అంతటి పరుష పదజాలాన్ని వాడుతూ ఉంటుంది. వాడలేనటు వంటి పదాలతో రెచ్చిపోయి కామెంట్స్ చేస్తూ ఉంటుంది. మెగా ఫ్యామిలీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్, నాని వంటి హీరోలను దారుణంగా టార్గెట్ చేస్తూ ఉంటుంది.

    హీరోయిన్స్, మహిళలపై..

    హీరోయిన్స్, మహిళలపై..

    తాజాగా శ్రీ రెడ్డి హీరోయిన్స్, మహిళలపై విరుచుకుపడింది. తాను చాల మంది పెళ్లైన స్త్రీలను చూస్తున్నానని, ఎవ్వరూ పద్దతిగా ఉండటం లేదని ఇలాంటి వారు సమాజానికి బాధ్యతాయుతమైన పౌరులను కానీ, సమాజానికి శాంతిని కానీ ఇవ్వలేరంటూ కామెంట్ చేసింది.

    Recommended Video

    Anchor Sreemukhi About Her Movie Career
    వేదాంత ధోరణిలో శ్రీ రెడ్డి..

    వేదాంత ధోరణిలో శ్రీ రెడ్డి..

    తాజాగా శ్రీ రెడ్డి చేసిన పోస్ట్ సారాంశం ఏంటంటే.. ‘భౌతికంగా తగిలే దెబ్బలు బాధగా ఉంటాయి.. కానీ అవి మానిపోతాయి..అయితే మానసికంగా తగిలే దెబ్బలకు మాత్రం మందులు ఉండవు.. ఆ నొప్పి కూడా కనిపించదు.. ఆ బాధ చచ్చే వరకు ఉంటుంద'ని ఇలా వేదాంత ధోరణి ఎత్తుకుంది. అయితే మరి ఇది ఎవరిని ఉద్దేశించి చేసిందో మాత్రం తెలియడం లేదు.

    English summary
    Sri Reddy About Physical And Mental Wounds. She Says That Physical Wounds Gets Healed But Mental Wounds Cant. It Will hunt Till Death.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X