మిగతావాళ్లు పక్కకెళ్లి ఆడుకోండి.. ఇండస్ట్రీకి ఆ నలుగురే పిల్లర్స్.. శ్రీరెడ్డి వీడియో వైరల్

శ్రీరెడ్డి చేసే వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో వేసే పోస్ట్‌లు ఎంతగా వైరల్ అవుతుంటాయో అందరికీ తెలిసిందే. టాలీవుడ్ గురించి, హీరోల గురించి నిత్యం ఏదో ఒక కామెంట్ చేస్తూ వివాదానికి కేంద్రబిందువుగా మారుతుంటుంది. సోషల్ మీడియాను ఎక్కువగా ఫాలో అయ్యే శ్రీ రెడ్డి ట్రెండ్‌కు తగ్గట్టు ట్రోలింగ్‌పై కౌంటర్లు ఇస్తుంటుంది. ఫ్యాన్స్ వార్ మీద కూడా తనదైన శైలిలో కామెంట్లు చేస్తుంటుంది.తాజాగా శ్రీ రెడ్డి వదిలిన వీడియో అందరినీ షాక్‌కు గురి చేస్తోంది.

అలా వైరల్..

అలా వైరల్..

శ్రీ రెడ్డి క్యాస్టింగ్ కౌచ్, మీటూ అంటూ చేసిన హంగామా గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ తెలిసిందే. అలా క్యాస్టింగ్ కౌచ్ పేరిట టాలీవుడ్ బడా ఫ్యామిలీలను దూషించిన తీరు సంచలనంగా మారింది. అలా చివరకు శ్రీ రెడ్డి చెన్నైలో సెటిలైంది. అయితే అక్కడ ఉన్నా కూడా సోషల్ మీడియా ద్వారా తాను చేయాల్సింది చేస్తోంది.

హీరోలపై ఫైర్..

హీరోలపై ఫైర్..

శ్రీరెడ్డి మామూలుగా మెగా హీరోలను టార్గెట్ చేస్తుంటుంది. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌ను ఓ రేంజ్‌లో విమర్శిస్తుంటుంది. సమయం సందర్భం అన్నది లేకుండా పవన్ కళ్యాణ్‌ను ఏకిపారేస్తుంటుంది. ఇక నాగబాబు, చిరంజీవి, నాగార్జున వంటి వారి మీద కూడా శ్రీ రెడ్డి నెగెటివ్ కామెంట్స్ చేస్తుంటుంది.

ఆ మధ్య అలా..

ఆ మధ్య అలా..

మధ్యలో శ్రీ రెడ్డి కొన్ని రోజులు ఎలాంటి వివాదాలను సృష్టించలేదు. తన యూట్యూబ్ చానెల్, వంట ప్రోగ్రాంలు, గార్డెనింగ్ అంటూ తన పనిలో తాను బిజీగా ఉంది. కానీ ఈ మధ్య మళ్లీ తనస్టైల్లో కామెంట్లు చేయడం మొదలుపెట్టింది. ఎన్టీఆర్ స్పీచులపై మాట్లాడుతూ కచ్చితంగా సీఎం అవుతాడని అన్న మాటలు బాగానే వైరల్ అయ్యాయి.

ఫ్యాన్స్ వార్ మీద..

ఫ్యాన్స్ వార్ మీద..

తాజాగా సోషల్ మీడియాలో మహేష్ బాబు, అల్లు అర్జున్ అభిమానులు ట్విట్టర్‌లో రచ్చ చేశారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ నానా హంగామా చేశారు. దీనిపైనా శ్రీరెడ్డి స్పందించింది. ఇలా గొడవలు పడే బదులు జాతిరత్నాలు సినిమా చూసి ఎంజాయ్ చేయండని శ్రీరెడ్డి పోస్ట్ చేసింది.

Recommended Video

OTT లో Latest Telugu Movies | Zombie Reddy రిలీజ్ ఇన్ Aha
నలుగురే పిల్లర్స్..

నలుగురే పిల్లర్స్..

శ్రీరెడ్డి తాజాగా ఇండస్ట్రీలోని నలుగురు పిల్లర్స్ అంటూ కొంతమంది హీరోల పేర్లు చెప్పింది. ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్, విజయ్ దేవరకొండలు మాత్రమే ఇండస్ట్రీకి నాలుగు పిల్లర్స్.. మిగతా వాళ్లంతా పక్కకెళ్లి ఆడుకోండి అంటూ కామెంట్ చేసింది. ఇక నవీన్ పొలిశెట్టి భవిష్యత్తు బాగుంటుందని, అతను కూడా ఓ పిల్లర్ అవుతాడని కామెంట్లలో చెప్పుకొచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X