Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
కుక్కలు ప్రతీచోటా ఉంటాయ్.. మీరు ఒంటరి కాదు.. రోజాకు శ్రీ రెడ్డి మద్దతు
ఓ వైపు కరోనా విజృంభిస్తూ ఉంటే మరోవైపు కొందరు రాజకీయ ప్రచార ఆర్భాటాలు కూడా చేసేస్తున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితిల్లోనూ ప్రారంభోత్సవాలు, ర్యాలీలు నిర్వహిస్తూ అందర్నీ షాక్‌కు గురి చేస్తున్నారు. ఇవన్నీ ఒకెత్తు అయితే.. గత రెండ్రోజుల నుంచి సోషల్ మీడియాలో ఓ వీడియో ఎంతగా వైరల్ అవుతోందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నగరి ఎమ్మెల్యే రోజా మహారాణిలా నడుచుకుంటూ వస్తూ ఉంటే ఆమె పై పూల వర్షం కురిపించడం, ప్రజలంతా సామాజిక దూరం పాటించక పోవడం సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా ఆమెకు మద్దతుగా శ్రీ రెడ్డి నిలిచింది. అసలు ఏం జరిగిందో ఓ సారి చూద్దాం.
బోరుబావి ప్రారంభోత్సవంలో..
పుత్తూరులోని సుందరయ్య నగర్లో ఓ బోరు బావి ప్రారంభోత్సవానికి రోజా హాజరైంది. ఈ సందర్భంగా స్థానిక మహిళలు రోజాపై పువ్వులు చల్లారు.. అది కాస్తా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయింది. ఇక ఈ వీడియోపై ప్రతిపక్షాలు, నెటిజన్స్ విరుచుకుపడ్డారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారని ఆమెపై ఫైర్ అయ్యారు.
గట్టిగా కౌంటర్..
తనపై వస్తోన్న విమర్శలపై స్పందించిన రోజా కాస్త గట్టిగానే కౌంటర్ వేసింది. ఎవరేమన్నా తాను పట్టించుకోనని, పేదలకు అండగా ఉంటున్నానని చెప్పుకొచ్చింది. లోకేష్ ఇంట్లో కూర్చుని బాగా తిని సైక్లింగ్ చేస్తున్నాడని, హైదరాబాద్‌లో కూర్చున్న చంద్రబాబు సలహాలు అవసరంలేదని.. ముందు ఆయన కొడుక్కి సలహాలు ఇవ్వాలని సెటైర్స్ వేసింది.
వైసీపీ, జగన్‌లకు శ్రీ రెడ్డి మద్దతు..
సినీ రంగంలోని స్టార్స్‌ను ఓ ఆట ఆడేసుకునే శ్రీ రెడ్డి.. పరుష పదజాలంతో దూషిస్తూ ఉంటుంది. ఇక రాజకీయాలకు సంబంధించి తనకు జగన్, వైసీసీ అంటే ఇష్టమని బహిరంగంగానే చెబుతూ ఉంటుంది. తనకు కేసీఆర్ అన్నా, మోడీ అన్నా ఇష్టమేనని చెబుతూ ఉంటుంది. అలాంటి శ్రీ రెడ్డి తాజాగా రోజాకు మద్దతిచ్చింది.
Recommended Video
మీ వెనుక మేమున్నామ్..
‘రోజా మంచి పనులు చేస్తోంది.. అందులో ఎలాంటి సందేహం లేదు.. మీరు అధైర్యపడకండి రోజా గారు.. మీరు, వైఎస్సార్సీపీ ఎప్పుడూ బాగుంటుంది.. ప్రతీ చోటా కుక్కలు ఉంటాయ్.. దైర్యంగా ముందుకు వెళ్లండి..మీరు ఒంటరి కాదు.. మీ వెనుక మేమున్నామ్.. ఇంకా పేద ప్రజలకు సాయం చేస్తూనే ఉండండ'ని శ్రీ రెడ్డి పోస్ట్ చేసింది.