సిల్క్ స్మితగా శ్రీరెడ్డి.. భారీ ప్రాజెక్ట్‌ను ప్రకటించిన వివాదాస్పద నటి.. క్రేజీ ప్రాజెక్ట్ ఎన్ని భాషల్లోనంటే
శ్రీరెడ్డి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెడుతోంది. త్వరలోనే ఓ శుభవార్తను చెబుతాను అంటూ నానా హంగామా చేస్తూ వచ్చింది. అయితే గుడ్ న్యూస్ అని చెప్పడంతో నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేశారు. ఓ రేంజ్‌లో ట్రోల్ చేసి పడేశారు. పెళ్లి చేసుకోబోతోన్నావా? తల్లి కాబోతోన్నావా? ఇలా పిచ్చిపిచ్చి కామెంట్లన్నీ పెట్టేశారు.అయితే తాజాగా అసలు ఆ శుభవార్త ఏంటన్నది తాజాగా ప్రకటించింది.

వీడియోతో ర చ్చ..
ఈరోజు మీకొక శుభవార్త చెప్పబోతున్నాను. ఇది నాకు కూడా శుభవార్తే. ఇది నాకొక గొప్ప అవకాశం. గడిచిన నాలుగైదు రోజులుగా నేను సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెట్టాను. ఒక శుభవార్త చెప్పబోతున్నానని తెలియజేశాను. దాన్ని ఈ రోజు రివీల్ చేస్తున్నానంటూ శ్రీ రెడ్డి ఓ వీడియోను షేర్ చేసింది.

ఒక్క పదం సరిపోదు..
అలా శ్రీరెడ్డి ఆ శుభవార్తను రివీల్ చేస్తూ.. నేను బయోపిక్ చేయబోతున్నాను. దిగ్గజ నటి, గ్లామరస్ యాక్ట్రెస్, సో హాట్.. ఆమె గురించి చెప్పడానికి ఒక్క పదం సరిపోదు, ఆమె ఎవరో కాదు సిల్క్ స్మిత మేడమ్ బయోపిక్. ఈ సినిమాకు మధు గారు దర్శకత్వం వహిస్తున్నారంటూ పక్కనే ఉన్న అతడిని చూపించింది. ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా రూపొందిస్తున్నామని శ్రీ రెడ్డి చెపుకొచ్చింది.

ఆశీర్వదించండి..
మిగిలిన వివరాలు తరవాత వీడియోలో వెల్లడిస్తాను. మీ ఆశీర్వాదాలు నాపై ఉండాలని కోరుకుంటున్నాను నన్ను ఇలానే ఆశీర్వదిస్తూ ఉండండి అని శ్రీరెడ్డి తెగ సంబరపడిపోయింది. అంతే కాకుండా ఆ తరువాత మరో ఫోటోను కూడా షేర్ చేసింది.

సిల్క్ స్మితలా మేకప్..
అయితే వీడియోను రిలీజ్ చేసిన తరువాత కాసేపటికే శ్రీరెడ్డి మరో ఫోటోను షేర్ చేసింది. ఇందులో సిల్క్ స్మితను తనను పోల్చుకుంటూ రెడీఅయిన స్టిల్‌ను షేర్ చేసింది. అయితే ఈ స్టిల్‌పై భిన్న రకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. కొందరేమో బాగుందని అంటే.. ఇంకొందరు మాత్రం పెదవి విరుస్తున్నారు.

వర్కవుట్ అయ్యేనా?
అసలే అక్కడుంది శ్రీరెడ్డి.. పైగా సిల్క్ స్మిత బయోపిక్ అంటున్నారు.. అసలు ఇది పట్టాలెక్కుతుంది.. ఎక్కినా కూడా వర్కవుట్ అవుతుందా? అనేది చూడాలి. ఏది ఏమైనా కూడా ఇన్నేళ్లకు శ్రీరెడ్డి చేతిలో ఓ క్రేజీ, భారీ ప్రాజెక్ట్ పడింది. మరి ఇది ఎంత వరకు కలిసి వస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











