Don't Miss!
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports అతని వల్లే RCB టైటిల్ చేజారింది- అనిల్ కుంబ్లే
- News విడుదల రజిని కిడ్నాప్...నామినేషన్ వేయకుండా
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
షకలక శంకర్‌ను టార్గెట్ చేసిన శ్రీరెడ్డి, కారణం అదేనా?
Recommended Video
టాలీవుడ్లో అతి తక్కువ కాలంలోనే డిమాండ్ ఉన్న కమెడియన్‌గా ఎదిగిన వారిలో షకలక శంకర్ ఒకరు. హీరోగా సినిమాలు చేస్తూ కామెడీ స్టార్‌గా ఎదిగే ప్రయత్నం చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ భక్తుడిగా చెప్పుకునే షకలక శంకర్ అవకాశం వచ్చినప్పుడల్లా పవర్ స్టార్ మీద తన ఇష్టాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేస్తుండటం తెలిసిందే.
పవర్ స్టార్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తన మద్దతు ప్రకటించడంతో పాటు... పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ సీఎం కావాలని కోరుకున్న వారిలో శంకర్ ఒకరు. ఈ క్రమంలో తన మాట తీరుతో పవన్ కళ్యాణ్ వ్యతిరేకులకు కూడా శంకర్ టార్గెట్ అయ్యాడు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పేరు శ్రీరెడ్డి.
షకలక శంకర్‌ను టార్గెట్ చేసిన శ్రీరెడ్డి
ముందు నుంచీ పవన్ కళ్యాణ్‌కు వ్యతిరేకంగా ఉన్న శ్రీరెడ్డి ఎన్నికలు ముగియడం, పవన్ కళ్యాణ్ ఓటమి పాలవ్వడంతో సంతోషంగా కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో ఆయనకు మద్దతుగా ప్రచారం చేసిన వారిని టార్గెట్ చేస్తూ కామెంట్లు చేస్తోంది. ‘‘ఎన్నికల ముగిసిన తర్వాత గుడ్డుపెట్టే కోడిలాగా గంపకింద దాక్కున్నాడు'' అంటూ షకలక శంకర్‌ను ఉద్దేశించి తాజాగా ఓ పోస్ట్ పెట్టారు.
గతంలోనే శంకర్‌కు వార్నింగ్
గతంలో శంకర్ తన సినిమా ప్రమోషన్లో భాగంగా... శ్రీరెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా విమర్శలు చేయడంతో ఆమె మండి పడ్డారు. ‘‘నా పేరు మధ్యలో తీసుకొస్తున్నారు. అవకాశాల కోసం రోడ్డున పడలేం కదా అంటూ ఏదేదో నా గురించి వాగుతున్నావనే విషయం నా వరకు వచ్చింది. ఇకపై అలా చేస్తే పళ్ళు రాలగొట్టి చేతిలో పెడతా..'' అంటూ వార్నింగ్ ఇచ్చింది.
మీ ఏడుపులు నాపై పని చేయవు
‘‘నన్ను చూసి ఎవరైతే ఏడుస్తున్నారో... మీ లాంటి వారి నుంచి వచ్చే నెగెటివ్ ఎనర్జీ నా కాళ్లను కూడా తాకలేదు. ఎందుకంటే ప్రతి అమావాస్య రోజు ఇలా చేస్తా''...అంటూ దిష్టి తీయించుకుంటున్న వీడియోను శ్రీరెడ్డి అభిమానులతో పంచుకున్నారు.
వీరిపై సెటైర్లు, వారిపై పొగడ్తలు
ఏపీ సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుపొందడం... తాను ఎంతో ఇష్టపడే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకు మద్దతు ఇవ్వడం, తాను వ్యతిరేకించిన వ్యక్తులు ఎన్నికల్లో ఓడిపోవడం... ఇలా అన్నీ శ్రీరెడ్డి కోరుకున్నట్లే జరుగడంతో ఆమె చాలా హ్యాపీగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో వారిని ఉద్దేశించి ఆసక్తికర పోస్టులు షేర్ చేస్తున్నారు.