యామిని గురించి మాట్లాడితే తాట తీస్తా.. హిస్టరీ బయపెడుతా.. మాధవిలతకు శ్రీ రెడ్డి కౌంటర్!
లాక్ డౌన్ సమయంలో చాలా వరకు సినీ తారలు ఛాలెంజ్ అంటూ సోషల్ మీడియాలో హడావుడిగా కనిపిస్తున్నారు. కానీ కొంతమంది మాత్రం ఎప్పటిలానే విమర్శలతో హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు. రీసెంట్ గా శ్రీ రెడ్డి మరోసారి తన మాటల డోస్ ని పెంచి మరొక నటికి కౌంటర్ ఇచ్చింది. పిచ్చి వాగుడు వాగితే తాట తీస్తా అంటూ ఘాటుగా కౌంటర్ ఇవ్వడం వైరల్ అవుతోంది.

మాధవి లతకు కౌంటర్..
శ్రీ రెడ్డి మాధవి లతకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చినట్లు అర్ధమవుతోంది. సోషల్ మీడియాలో ఆమె చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. ఇటీవల నటి మాధవి లత బీజేపీలో చేరిన సాధినేని యామినిపై ఊహించని విధంగా నెగిటివ్ కామెంట్స్ చేశారు. అయితే ఇప్పుడు శ్రీ రెడ్డి ఆ కామెంట్స్ కు గట్టి కౌంటర్ ఇచ్చింది. గొడవపై ఎవరు స్పందించలేదు అనుకుంటున్న సమయంలో శ్రీ రెడ్డి కామెంట్స్ చేయడంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.

అసలు ఏం జరిగిందంటే..
ఇటీవల సాధినేని యామిని టీడీపీ నుంచి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. అయితే ఆ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాధవి లత.. ఒకప్పుడు మల్లెపూల నలిపే కథలు చెప్పి క్రేజ్ తెచ్చుకున్నవారికి పార్టీలో గుర్తింపు ఇవ్వడం కరెక్ట్ కాదని సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. పార్టీలో కష్టపడిన వారిని పట్టించుకోకుండా అబద్ధాలు చెప్పే వారికి పార్టీలో స్థానం ఇస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేసిన మాధవి లతకు ఇప్పుడు శ్రీ రెడ్డి నుంచి ఊహించని కౌంటర్ ఎదురైంది.

తాట తీస్తా..
సాధినేని యామినిపై కామెంట్స్ చేస్తే సహించేది లేదని శ్రీ రెడ్డి ఈ విధంగా స్పందించారు. 'యామిని సాధినేనికి నేను సపోర్ట్ చేస్తున్నాను.. ఆమె గురించి ఎవరైనా పిచ్చి వాగుడు వాగితే తాట తీస్తా.. హిస్టరీ కూడా బయటకు తీయవలసివస్తుంది' అంటూ శ్రీ రెడ్డి మాధవిలతకు గట్టి కౌంటర్ ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో వీరి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Recommended Video

శ్రీ రెడ్డి vs మాధవి లత
మాధవి లతకు శ్రీ రెడ్డికి మధ్య మాటల యుద్ధాలు కొత్తేమి కాదు. పవన్ కళ్యాణ్ పై శ్రీ రెడ్డి, కత్తి మహేష్ వంటి వారు స్పెషల్ గా టార్గెట్ చేసినప్పుడు మాధవిలత ముందుకొచ్చి వారికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇక చాలా రోజుల తరువాత సొంత పార్టీలోనే మాధవిలత విమర్శలు చేస్తున్న సమయంలో ఈ విధంగా మరోసారి ఇద్దరి మధ్య వివాదాలు మొదలయ్యాయి. మరి శ్రీ రెడ్డి ఇచ్చిన కౌంటర్ కి నెక్స్ట్ మాధవి లత నుంచి ఎలాంటి ఆన్సర్ వస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











