అందరూ ఆ ఆకలితోనే చచ్చిపోతున్నారు.. అమ్మాయిలు, అబ్బాయిలకు రిప్.. శ్రీ రెడ్డి బోల్డ్ కామెంట్స్
శ్రీ రెడ్డి.. ఎప్పుడెలా ఉంటుంది? ఏం మాట్లాడుతుంది? ఎలా ప్రవర్తిస్తుంది? అనే విషయాలు ఎవ్వరికీ అర్థం కావు. ఈమె చేసిన ఆరోపణలు, చేసిన హడావిడి అప్పట్లో ఎంతగా హల్చల్ చేశాయో అందరికీ తెలిసిందే. దగ్గుబాటి అభిరామ్ తనను మోసం చేశాడని మీడియాకెక్కడం, మధ్యలో పవన్ కళ్యాణ్‌ను దూషించడం, నానిపై అసభ్యకర కమెంట్స్ చేయడం లాంటివెన్నో చేసింది. అనంతరం చెన్నై వెళ్లి సెటిలైపోవడంతో అంతా సద్దుమణిగినట్టే అనిపించింది. అయితే గత కొన్ని రోజులుగా శ్రీ రెడ్డి మళ్లీ తన విశ్వరూపాన్ని చూపిస్తోంది.

అసభ్యపదజాలంతో..
రాకేష్ మాస్టర్, కరాటే కళ్యాణిల వ్యవహారంతో మళ్లీ శ్రీ రెడ్డి వార్తల్లొ నిలిచింది. అప్పటి వరకు యూట్యూబ్‌లో వంటలకు సంబంధించిన వీడియోలు పెట్టుకుంటూ.. తనకు వచ్చిన అడపాదడపా చిత్రాలు చేసుకుంటూ పోతోన్న శ్రీరెడ్డి మళ్లీ తన విశ్వరూపాన్ని చూపెట్టింది. ఫేస్ బుక్‌లో లైవ్‌లో రాయలేని పదజాలంతో రెచ్చిపోయింది. రాకేష్ మాస్టర్, కరాటే కళ్యాణిపై బూతుల వర్షం కురిపించింది.

మెగాఫ్యామిలీని టార్గెట్..
సమయం సందర్భం లేకుండా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ ఉంటుంది. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌పై విరుచుకుపడుతూ ఉంటుంది. రాజకీయంగా, సినిమాల పరంగా ఎప్పుడూ ఏదో ఒక కామెంట్ చేస్తూనే ఉంటుంది.దీంతో మెగా ఫ్యాన్స్‌కు, శ్రీరెడ్డి వాగ్వాదం జరగుతూనే ఉంటుంది.

కరోనాపైనా కామెంట్స్..
ప్రపంచమంతా కరోనా వైరస్‌కు గజగజ వణికిపోతూ ఉంటే.. శ్రీ రెడ్డి మాత్రం దాన్ని కూడా వదలట్లేదు. పిచ్చి పిచ్చి కామెంట్లతో సెటైర్స్ వేస్తూ హల్చల్ చేస్తోంది. ప్రధాని పొడిగించిన లాక్ డౌన్‌పై, మోడీ నిర్ణయాలపైనా రీసెంట్‌గా కౌంటర్స్ వేసింది. పేద వారి ఆకలిని తీర్చండని సలహాలు ఇచ్చింది.
Recommended Video

అదే ఆకలితో ఉన్నారు..
కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో అందరూ ఇంటికే పరిమితమయ్యారు. దీనిపై శ్రీరెడ్డి బోల్డ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం జనాలంతా.. ఆకలి కంటే.. సెక్స్ కోసమే పరితపిస్తున్నారు.. మీ బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్‌కు రిప్ అంటూ ఓ కొంటె పోస్ట్ చేసింది.


Click it and Unblock the Notifications











