మహిళలు ఇంట్లో అలా.. అదే కొనసాగితే మగాళ్లు మ్యూజియంలోనే కనిపిస్తారు.. శ్రీ రెడ్డి కామెంట్స్
శ్రీ రెడ్డి ఈ మధ్య కాస్త రూట్ మార్చింది. సూక్తులు, నీతులు వల్లేవేస్తుంది. కరోనా వైరస్ విజృంభిస్తున్న ఈ సమయంలో శ్రీ రెడ్డి చేసే పోస్ట్‌లు అందర్నీ ఆశ్చర్య పరుస్తూనే ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో మహిళలపై కామెంట్స్ చేస్తూ.. మగవారికి మద్దతు తెలుపుతోంది. మగవారిని ఆడవారు పీక్కుతింటున్నారన్నట్టుగా కామెంట్స్ చేస్తూ నెటిజన్స్‌ను ఆశ్చర్య పరుస్తోంది. మొన్నటికి మొన్న హీరోయిన్ల వల్ల మహిళలు చెడిపోతున్నారని, మగవారిని మోసం చేస్తున్నారని పోస్ట్ చేసింది. తాజాగా మగవారంతా మ్యూజియంలోనే కనిపిస్తారని బాంబ్ పేల్చింది. ఇంతకీ శ్రీ రెడ్డి చేసిన వ్యాఖ్యలేంటో ఓ సారి చూద్దాం.

అలాంటి వారు మంచి పౌరులను..
తాజాగా శ్రీ రెడ్డి హీరోయిన్స్, మహిళలపై విరుచుకుపడింది. తాను చాల మంది పెళ్లైన స్త్రీలను చూస్తున్నానని, ఎవ్వరూ పద్దతిగా ఉండటం లేదని ఇలాంటి వారు సమాజానికి బాధ్యతాయుతమైన పౌరులను కానీ, సమాజానికి శాంతిని కానీ ఇవ్వలేరంటూ కామెంట్ చేసింది.

దాని కోసమే చచ్చిపోతున్నారు..
కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో అందరూ ఇంటికే పరిమితమయ్యారు. దీనిపై శ్రీరెడ్డి బోల్డ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం జనాలంతా.. ఆకలి కంటే.. సెక్స్ కోసమే పరితపిస్తున్నారు.. మీ బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్‌కు రిప్ అంటూ ఓ కొంటె పోస్ట్ చేసింది.

వాటికి కరోనా కాదు..
తాజాగా శ్రీ రెడ్డి చేసిన మరో పోస్ట్ వైరల్‌గా మారింది. ‘అందరూ డిప్రెషన్‌లోకి వెళ్లిపోతోన్నారు.. ఇది మంచి పరిణామం కాదు.. అయితే దీనికి మాత్రం కరోనా కారణం కాదు.. ఇంట్లోనే ఉండటం అనే కారణం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.. సైకాలిజిలికల్ ప్రాబ్లమ్స్, డిప్రెషన్స్ ఎంతోమందిని చంపబోతోంద'ని పోస్ట్ చేసింది.
Recommended Video

ఇక మగాళ్లు మ్యూజియంలోనే..
మరో పోస్ట్‌లో శ్రీ రెడ్డి ఆశ్చర్యకరమైన పోస్ట్ చేసింది. ‘ఈ క్వారంటైన్ సమయంలో తల్లి, తండ్రి, మొగుడు, పెళ్లాం, కూతరు, కొడుకు ఎవరైనా సరే.. వారు గతాన్ని తవ్వుకుంటున్నారు.. పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటున్నారు.. పోట్లాడుతున్నారు.. ఒక వేళ ఇదే కొనసాగితే... మగవారినే కేవలం మ్యూజియంలోనే చూడాల్సి వస్తుంద'ని తెలిపింది.


Click it and Unblock the Notifications











