కార్తిపై శ్రీరెడ్డి ఫైర్: వ్యభిచారులే నయం, నిరూపిస్తే తల నరక్కుంటానని సవాల్!

By Bojja Kumar

కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేస్తూ తమిళనాడులో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న శ్రీరెడ్డి.... తనకు వ్యతిరేకంగా కామెంట్స్ చేసిన హీరో కార్తిపై విరుచుకుపడింది. అదే సమయంలో తనపై వ్యభిచారం చేస్తున్నాని, డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేస్తున్నానని కేసులు పెట్టిన వారికి సైతం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఎవరినైనా తాను బ్లాక్ మెయిల్ చేసినట్లు నిరూపిస్తే తల నరుక్కుంటాను అంటూ సవాల్ చేసింది.

హాట్సాఫ్ కార్తి.. బాధితురాలిని భలే వాడుకుంటున్నావ్

హాట్సాఫ్ కార్తి.. బాధితురాలిని భలే వాడుకుంటున్నావ్

కార్తి తన సినిమా ‘కడైకుట్టి సింగం' ప్రమోషన్ల కోసం తన పేరు వాడుకుంటున్నాడని శ్రీరెడ్డి ఆరోపణలు చేసింది. నా వల్ల నీకు సక్సెస్ వస్తే ఆనందమే, బాధితురాలిని కూడా సినిమా పబ్లిసిటీ కోసం వాడుకుంటున్న నీకు హాట్సాఫ్ అంటూ... శ్రీరెడ్డి వ్యాఖ్యానించారు.

నిరూపిస్తే తల నరక్కుంటా

నిరూపిస్తే తల నరక్కుంటా

తాను చేసేది వ్యభిచారం అంటూ వస్తున్న ఆరోపణలపై శ్రీరెడ్డి స్పందిస్తూ.... డబ్బులు తీసుకుని పడుకుంటే అది వ్యభిచారం అవుతుంది. తనను సెక్సువల్‌గా వాడుకున్న దర్శకులు, హీరోలు, నిర్మాతలు తనకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. డబ్బు కోసం నేను ఎవరినీ బ్లాక్ మెయిల్ కూడా చేయలేదు. నేను అలా చేసినట్లు నిరూపిస్తే తల నరుక్కుంటాను అని శ్రీరెడ్డి సవాల్ చేశారు.

వ్యభిచారులే నయం..

వ్యభిచారులే నయం..

వ్యభిచారులకు ఆ పని చేసినందుకు కనీసం ఎంతో కొంత డబ్బు వస్తుంది. కానీ నన్ను వాడుకున్న సినీ పెద్దలు కనీసం భోజనం కూడా పెట్టకుండా ఖాళీ కడుపుతో పంపించేశారు. అవకాశాలు ఇస్తామని చెప్పి మోసం చేశారు అని శ్రీరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

లాజిక్స్ మాట్లాడొద్దు సార్

లాజిక్స్ మాట్లాడొద్దు సార్

నేను నడిగర్ సంఘం పెద్దలతో మాట్లాడటానికి ప్రయత్నాలు చేస్తున్నాను. గౌరవనీయులైన విశాల్, కార్తి సర్ మాటలు నన్ను చాలా బాధించాయి. నడిగర్ సంఘం ఉన్నదే ఆర్టిస్టుల సమస్యలు పరిష్కరించడానికి, అనవసరమైన సలహాలు ఇవ్వొద్దు సార్, నా బాధను అర్థం చేసుకోండి, లాజిక్స్ మాట్లాడొద్దు అని శ్రీరెడ్డి సూచించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X