అల్లు అరవింద్ కొడుకులు కూడా అలాంటి వారే: శ్రీరెడ్డి సంచలనం

By Bojja Kumar

Recommended Video

అల్లు అరవింద్ కొడుకులు కూడా అలాంటి వారే: శ్రీరెడ్డి సంచలనం

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ సమస్యపై పోరాటం చేస్తున్న నటి శ్రీరెడ్డి తమ లాంటి వారికి టాలీవుడ్ ఇండస్ట్రీలో న్యాయం జరుగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సిగ్గు విడిచి తమకు జరిగిన అన్యాయం గురించి వెల్లవేసుకున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని, అల్లు అరవింద్ లాంటి బాధ్యత ఉన్న పెద్దలు కూడా ఇండస్ట్రీలో అమ్మాయిల సమస్యలకు పరిష్కారం చూపడం లేదని వాపోయారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ కొడుకుల వల్ల కూడా ఇండస్ట్రీలో అమ్మాయిలు ఇబ్బందులు పడుతున్నారని శ్రీరెడ్డి ఆరోపించారు.

నన్ను సొసైటీలోపురుగులా...

నన్ను సొసైటీలోపురుగులా...

అల్లు అరవింద్ సర్... మీరూ, మీ అబ్బాయి ఒకానొక టైమ్‌లో ఎంత బ్లేమ్ చేశారో నాకు తెలుసు. నన్ను సొసైటీలో ఒక పురుగును చూసినట్లు చూడటానికి మీ ఫ్యామిలీ అంతా చాలా కష్టపడ్డారు.

మీ కొడుకులు ఏం చేస్తున్నారో తెలుసా?

మీ కొడుకులు ఏం చేస్తున్నారో తెలుసా?

మీ అబ్బాయిలు... అందరినీ ఉద్దేశించి అనను. ఎవరో మీకు తెలుసు. మీరు రోడ్డు మీదకు వదిలేశారు. వారు ఆడపిల్లలను ఏం చేస్తున్నారు? ఎక్కడ తిరుగుతున్నారు? ఎలా బిహేవ్ చేస్తున్నారో? తెలుసా? ప్రొడ్యూసర్ కొడుకులైతే ఏంటి సార్? మేము ఆడపిల్లలం. సఫర్ అవుతున్నాం. తప్పు మీ వైపు ఉన్నపుడు సాల్వ్ చేయాల్సిన బాధ్యత మీపై ఉంది.

పవన్ కళ్యాణ్‌ను అంటే వచ్చారు తప్ప...

పవన్ కళ్యాణ్‌ను అంటే వచ్చారు తప్ప...

పెద్దమనిషిగా, సినిమా ఇండస్ట్రీలో ఒక రెస్పాన్సిబుల్ పర్సన్‌గా మీరు సమస్యను సాల్వ్ చేయడం మానేసి పవన్ కళ్యాణ్ గారిని అనగానే... ఆయన గురించి మాట్లాడటానికి బయటకు వచ్చారు తప్ప ఇండస్ట్రీలో సమస్యలు ఉన్నాయన్నపుడు దాని గురించి మాట్లాడటానికి మీరు బయటకు రాలేదు. ఈ రోజు మీ కొడుకుల వలన, సురేష్ బాబు కొడుకు లాంటి వారి వలన ఇండస్ట్రీకి వద్దామనుకుంటున్న ఆడపిల్లలు పడే ఇబ్బందులు మీకు అర్థమవుతున్నాయా? అంటూ శ్రీరెడ్డి ప్రశ్నించారు.

చిన్న సినిమాలను తొక్కేస్తున్నారు

చిన్న సినిమాలను తొక్కేస్తున్నారు

అల్లుఅరవింద్.. సురేష్ బాబు లాంటి వారు పెద్ద పొజిషన్‌లో ఉన్నారు, థియేటర్లు మీ చేతుల్లోనే ఉన్నాయి.. సినిమాలు మీరే చేస్తారు? మీరే లాభాలు తినేస్తారు, చిన్న సినిమాలు విడుదల కాకుండా అడ్డుకుంటారు.. అవసరమైతే తొక్కేస్తారు.. కావాలనుకుంటే వాటిని ఎప్పుడు విడుదల చేయాలో మీరే డిసైడ్ చేస్తారంటూ తనదైన రీతిలో శ్రీరెడ్డి విరుచుకుపడ్డారు.

మీ కొడుకుల అరాచకాలకు బలవుతున్నాం

మీ కొడుకుల అరాచకాలకు బలవుతున్నాం

మీ లాంటి పెద్దవాళ్ల కొడుకులు చేసే అరాచకాలకు మేమంతా బలవుతున్నాం. మీకు ప్రాపిట్స్ కావాలే తప్ప ఇండస్ట్రీలో మాలాంటి వారు పడుతున్న కష్టాలు అక్కర్లేదు. మీలాంటి పెద్దవాళ్ల కొడుకులకేమో సెక్సువల్ సుఖాలు కావాలి. అందరినీ ఉద్దేశించి అనడం లేదు కొంతమంది అలాంటి వారు ఉన్నారు అని శ్రీరెడ్డి చెప్పుకొచ్చారు.

నాకు ఏ రోగం సోకలేదు

నాకు ఏ రోగం సోకలేదు

బయట మా గురించి... మేకప్ వేసుకుంటారు, పడుకుంటారు, ఎంత మంది దగ్గర పడుకున్నారో... ఎన్ని రోగాలొచ్చాయో అంటున్నారు. నేను చాలా హెల్దీ, సింగిల్ ఇన్‌ఫెక్షన్ కూడా లేదు. కానీ అందరితో మాటలు అనిపించుకోవాల్సి వస్తుంది.

మగాడు చేస్తే శృంగారం, మేము చేస్తే వ్యభిచారమా?

మగాడు చేస్తే శృంగారం అని గొప్పగా చెబుతారు. మేము కడుపుకాలి కొంత మంది దగ్గర పడుకుంటే వేశ్యలు, వరస్ట్ ఫెల్లోస్... మాకు రోగాలుంటాయి అంటూ ఇష్టారాజ్యానికి మాపై కామెంట్స్ చేస్తారు అంటూ శ్రీరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X