twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అల్లు అర్జున్‌పై విరుచుకుపడ్డ శ్రీరెడ్డి.. శవాల మీద పేలాలు.. బన్నీపై దారుణమైన కామెంట్స్

    |

    స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ఈ మేరకు టాలీవుడ్, బాలీవుడ్ సెలెబ్రిటీలు బన్నీకి విషెస్ తెలిపారు. ఇక సౌత్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ చేసిన హల్చల్‌కు ట్విట్టర్ మొత్తం హోరెత్తిపోయింది. పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన కొత్త సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ఓ రేంజ్‌లో వైరల్ అయింది. అయితే ఇదంతా బాగానే ఉంది కానీ మధ్యలో శ్రీ రెడ్డి ఎంటర్ అవ్వడంతో కథ అంతా వేడెక్కింది. మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ వచ్చే శ్రీ రెడ్డి తాజాగా బన్నీపై కామెంట్స్ చేయడంతో వైరల్ అవుతోంది. ఇంతకీ శ్రీ రెడ్డి చేసిన కామెంట్స్ ఏంటో ఓ సారి చూద్దాం.

    Recommended Video

    Sri Reddy Hot Comments On Allu Arjun's Pushpa First Look Release
    బన్నీ బర్త్ డే హల్చల్..

    బన్నీ బర్త్ డే హల్చల్..

    బన్నీ బర్త్ డే సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఫ్యాన్స్ ట్వీట్స్, హ్యాష్ ట్యాగ్‌లతో ట్విట్టర్ మొత్తం ఊగిపోయింది. ఓ వైపు బన్నీ బర్త్ డేకు విషెష్, మరో వైపు కొత్త సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ హల్చల్ చేశాయి. ఇలా నిన్న అంతా అల్లు అర్జున్ హవానే నడిచింది. నేషనల్ వైడ్‌గా టాప్ ప్లేస్‌లో ట్రెండ్ అయింది.

     విషెస్‌ల వెల్లువ..

    విషెస్‌ల వెల్లువ..

    బన్నీకి దాదాపు టాలీవుడ్ సెలెబ్రిటీలంతా విషెస్ తెలిపారు. దర్శకులు, హీరోలు, హీరోయిన్లు, నిర్మాణ సంస్థలు ఇలా ప్రతీ ఒక్కరూ తమ ప్రేమను విషెస్ రూపంలో చాటారు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ మాత్రం బన్నీపై ప్రత్యేక ప్రేమను కురిపించారు. చిరంజీవి, నాగబాబు, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, రామ్ చరణ్ ఇలా ప్రతీ ఒక్కరూ విష్ చేశారు.

    ‘పుష్ప'లో బన్నీ లుక్..

    ‘పుష్ప'లో బన్నీ లుక్..

    అల్లు అర్జున్ 20వ చిత్రంగా సుకుమార్ దర్శకత్వంలో రాబోతోన్న చిత్రానికి పుష్ఫ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. బన్నీ బర్త్ డే కానుకగా రిలీజ్ చేసిన ఈ టైటిల్, ఫస్ట్ లుక్ అందరికీ తెగ నచ్చేసింది. సోషల్ మీడియాలో పుష్ప, బన్నీ లుక్ ట్రెండ్ అయ్యాయి. ఇంతగా వైరల్ అవ్వడంతో శ్రీ రెడ్డి బన్నీని టార్గెట్ చేసింది.

    శవాల మీద పేలాలు..

    శవాల మీద పేలాలు..

    మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసేందుకు ముందుండే శ్రీ రెడ్డి తాజాగా బన్నీ బర్త్ డే వేడుకలపై, కొత్త సినిమా అప్డేట్‌లపై పడింది. ‘కరోనాతో చచ్చిపోతుంటే.. బర్త్ డ్ గిప్ట్‌లు అని శవాల మీద పేలాలు ఏరుకున్నట్టు వ్యాపారం చేసుకోవటం వెల్లుల్లి అర్జున్‌కు దక్కింది' అంటూ దారుణంగా కామెంట్స్ చేసింది. ఇక వీటిపై బన్నీ ఫ్యాన్స్ శ్రీ రెడ్డిని ఆడేసుకుంటున్నారు.

    English summary
    Sri Reddy Comments On Allu Arjun And Pushpa. She Fires On Allu Arjun Releasing First Look And Title In This epidemic Situtaion.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X