అలాంటి అమ్మాయిలతోనే అబ్బాయిలకు సుఖం.. పబ్‌కు వెళ్తున్నామంటే కారణమదే.. శ్రీరెడ్డి సూక్తులు వైరల్
నిరంతరం సినీ సెలెబ్రిటీలు, రాజకీయ నాయకులను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేసే శ్రీ రెడ్డి.. ఈ మధ్య రూట్ మార్చింది. అమ్మాయిలు, అబ్బాయిలు అంటూ కొత్త పాట పాడుతోంది. ఆడవారు మగవారిని పీక్కుతింటున్నారని, ఆడవారే చెడ్డవారు అన్నట్టుగా శ్రీ రెడ్డి పోస్ట్‌లు చేస్తోంది. తాజాగా ఆమె చేసిన మరో పోస్ట్ చూస్తుంటే శ్రీరెడ్డి సూక్తులు భలే వల్లేవేస్తుందో అని అనిపించక మానదు. ఇంతకీ ఆమె ఏమని కామెంట్ చేసిందో ఓ సారి చూద్దాం.
Recommended Video

అలాంటి వారు మంచి పౌరులను..
శ్రీ రెడ్డి ఈ మధ్య వరుసగా మహిళలు, హీరోయిన్స్, అమ్మాయిలు, అబ్బాయిలను టార్గెట్ చేస్తూ పోస్ట్‌లు చేస్తోంది. నాలుగైదు రోజుల క్రితం శ్రీరెడ్డి.. హీరోయిన్స్, మహిళలపై విరుచుకుపడింది. తాను చాల మంది పెళ్లైన స్త్రీలను చూస్తున్నానని, ఎవ్వరూ పద్దతిగా ఉండటం లేదని ఇలాంటి వారు సమాజానికి బాధ్యతాయుతమైన పౌరులను కానీ, సమాజానికి శాంతిని కానీ ఇవ్వలేరంటూ కామెంట్ చేసింది.

ఇక మగాళ్లు మ్యూజియంలోనే..
మరో పోస్ట్‌లో శ్రీ రెడ్డి ఆశ్చర్యకరమైన పోస్ట్ చేసింది. ‘ఈ క్వారంటైన్ సమయంలో తల్లి, తండ్రి, మొగుడు, పెళ్లాం, కూతరు, కొడుకు ఎవరైనా సరే.. వారు గతాన్ని తవ్వుకుంటున్నారు.. పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటున్నారు.. పోట్లాడుతున్నారు.. ఒక వేళ ఇదే కొనసాగితే... మగవారినే కేవలం మ్యూజియంలోనే చూడాల్సి వస్తుంద'ని తెలిపింది.

వారంతా మంచి వారని అనుకుంటున్నారా?
ఎవరైతే సంప్రదాయ దుస్తులను ధరిస్తారో, ఎవరైతే దేవాలయాలకు వెళ్తారో, సంప్రదాయంగా కనిపిస్తారో, ఎవరైతే డాడీ కంట్రోల్‌లో ఉంటారో? వారంతా మంచి వారని మీరు అనుకుంటున్నారా? మంచి జోక్ అంటూ ఓ సెటైర్ వేసింది.

పబ్‌కు వెళ్లేది అందుకే..
మరో పోస్ట్‌లో ‘మేము పబ్‌కు వెళ్తున్నామంటే.. మాకేదో క్యారెక్టర్ లేదని అర్థం కాదు. మమ్మల్ని ఎవరో హర్ట్ చేశారని అర్థం..వారిని మరిచిపోవడానికి అక్కడికి వెళ్తామ'ని చెప్పుకొచ్చింది. ఇంకో పోస్ట్‌లో క్యారెక్టర్ అనేది మంచి హృదయంలో ఉంటుంది..వెజినాలో కాదని తెలిపింది.

అలాంటివారి వల్లే సుఖం..
మరో పోస్ట్‌లో శ్రీ రెడ్డి.. ‘స్వతంత్ర్యంగా బతికే అమ్మాయి, ఏదైనా సాధించిన అమ్మాయి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మ గౌరవం ఉన్న అమ్మాయిలే అబ్బాయిలకు సంతోషమైన జీవితాన్ని, సుఖాన్ని ఇస్తారు. అందుకే ఎమోషనల్ హత్యాచారం చేసే సీరియల్ యాక్టర్స్‌ను సెలెక్ట్ చేసుకోకండ'ని రాసుకొచ్చింది. అంతా బాగానే ఉంది కానీ ఇప్పుడీ సూక్తులు ఎందుకు చెబుతుందో మాత్రం ఎవ్వరికీ అర్థం కావడం లేదు.


Click it and Unblock the Notifications











