చిరంజీవిపై పడిన శ్రీ రెడ్డి.. ఆయన తర్వాతే ఎన్టీఆర్ అంటూ షాకింగ్ కామెంట్

కొంతకాలంగా టాలీవుడ్ లోని ఒక్కొక్కరిపై వీరోచిత కామెంట్లు చేస్తూ సంచలనం సృష్టిస్తున్న సంచలన తార శ్రీ రెడ్డి ఈ సారి మెగాస్టార్ చిరంజీవిపై కామెంట్ వదిలింది. అయితే తన రెగ్యులర్ పంథాకు భిన్నంగా ఈమె చేసిన కామెంట్ ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ శ్రీ రెడ్డి చేసిన ఆ కామెంట్ ఏంటి? మెగాస్టార్ జోలికి ఆమె ఎందుకొచ్చింది? వివరాల్లోకి పోతే..

సరికొత్త లుక్‌లో చిరంజీవి.. కుర్ర హీరోలు ఈర్ష పడేలా

సరికొత్త లుక్‌లో చిరంజీవి.. కుర్ర హీరోలు ఈర్ష పడేలా

సీనియర్ హీరోగా తెలుగు ఇండస్ట్రీని ఏలుతున్న చిరంజీవి సరికొత్త లుక్‌ ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ లుక్ లో చిరు.. కుర్ర హీరోలకే ఈర్ష కలిగేలా ఉన్నాడు. స్లిమ్ లుక్‌లో వెరీ డీసెంట్ గా కనిపిస్తున్న చిరంజీవి వయసు ఏ మాత్రం బయటపడటం లేదు. 30 ఏళ్ల క్రిందట చిరు ఎలా ఉన్నదో అచ్చం అలాగే యంగ్ లుక్‌లో కనిపిస్తున్న చిరంజీవిని చూసి షాకవుతున్నారు ప్రేక్షకులు.

చిరంజీవి ఫ్రెష్ లుక్‌పై పడిన శ్రీ రెడ్డి

తాజాగా శ్రీ రెడ్డి.. ఈ లుక్ పై షాకింగ్ కామెంట్ పోస్ట్ చేసింది. ''అందంలో, అభినయంలో నటనలో డాన్స్ లో మెగాస్టార్ చిరంజీవి గారిని అందుకోవడం ఎవరి వల్ల కాదు, చిరంజీవి గారి తర్వాత తెలుగు ఇండస్ట్రీలో గొప్ప నటుడు ఎన్టీఆర్ గారు తర్వాత రామ్ చరణ్'' అంటూ డిఫెరెంట్ వాయిస్ వినిపించింది శ్రీ రెడ్డి.

చిరు తమ్ముడు పవన్ పై అటాక్

చిరు తమ్ముడు పవన్ పై అటాక్

గతంలో కాస్టింగ్ కౌచ్ విషయమై పోరాడుతున్నపుడు ఇదే శ్రీరెడ్డి చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్‌ను, ఆయన తల్లిని అనరాని మాటలు అన్న సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ ఉదంతం పెద్ద చర్చలకు దారితీసింది. పవన్ అభిమానులు శ్రీరెడ్డి ట్వీట్స్, కామెంట్స్ ఓ రేంజ్ లో మండిపడ్డారు. అలాంటిది ఇప్పుడు చిరంజీవిపై ఇలా కామెంట్ పెట్టడం ఆశ్చర్యపరుస్తోంది.

నాని, నాగార్జునపై పోరాటం

నాని, నాగార్జునపై పోరాటం

మరోవైపు నాని, నాగార్జునపై ఓ రేంజ్ లో విరుచుకుపడుతోంది శ్రీ రెడ్డి. వల్గర్ పదజాలం వాడుతూ నానిని ఏకిపారేసిన శ్రీ రెడ్డి.. బిగ్ బాస్ విషయమై యాంకర్ శ్వేతా రెడ్డికి సపోర్ట్ చేస్తోంది. ఈ మేరకు నాగార్జునపై కూడా శ్రీ రెడ్డి విరుచుకుపడుతుండటం విశేషం.

సైరా నరసింహా రెడ్డి మూవీ

సైరా నరసింహా రెడ్డి మూవీ

తొలితరం స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవితకథ ఆధారంగా రామ్ చరణ్ నిర్మాణంలో సైరా నరసింహా రెడ్డి మూవీ తెరకెక్కుతోంది. మేజర్ పార్ట్ షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా అక్టోబర్ 2వ తేదీన విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా.. విజయ్ సేతుపతి, అమితాబ్ బచ్చన్, కిచ్చ సుదీప్, జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X