నీదో డొక్కు కారు.. దేవుడు ఉన్నాడ్రా.. దగ్గుబాటి అభిరామ్‌పై అక్కసు వెల్లగక్కిన శ్రీ రెడ్డి

దగ్గుబాటి అభిరామ్ గురించి తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలిసిందే. ఒక్క సినిమా కూడా తీయకపోయినా వెండితెరపై కనిపించకపోయినా కూడా చాలా ఫేమస్. అది కూడా శ్రీరెడ్డి పుణ్యమే. శ్రీరెడ్డి అభిరామ్ వివాదం అప్పట్లో పెను సంచలనాన్ని నమోదు చేసింది. ప్రైవేట్ ఫోటోలను లీక్ చేస్తూ శ్రీరెడ్డి నానా రచ్చ చేసింది. ఇక ఆ వివాదంతోనే అభిరామ్ ఫుల్ ఫేమస్ అయ్యాడు. మధ్య మధ్యలో సమయం దొరికినప్పుడల్లా శ్రీరెడ్డి అభిరామ్‌పై నిప్పులు చెరుగుతూ ఉంటుంది. తాజాగా అభిరామ్ కారుకు యాక్సిడెంట్ అయిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో శ్రీరెడ్డి స్పందించింది.

Recommended Video

Sri Reddy Comments On Daggubati Abhiram ఆఫ్ట్రాల్ రోడ్ సైడ్ యాక్టర్‌వి అన్నావే? || Oneindia Telugu
అభిరామ్ కారుకు ప్రమాదం..

అభిరామ్ కారుకు ప్రమాదం..

దగ్గుబాటి అభిరామ్‌ కారుకు ప్రమాదం జరిగిందని నేటి ఉదయం నుంచి వార్తలు దావానంలా వ్యాప్తి చెందుతున్నాయి. అయితే వీటిపై దగ్గుబాటి కుటుంబం స్పందించింది. ఆ వార్తలను ఖండిస్తూ ఓ ప్రకటన కూడా జారీ చేసింది. కారు ప్ర‌మాదానికీ, ద‌గ్గుబాటి అభిరామ్‌కూ ఎలాంటి సంబంధం లేదు.. అది ద‌గ్గుబాటి ఫ్యామిలీకి సంబంధించిన కారే కాదని స్ప‌ష్టం చేశారు.

ఎంటరైన శ్రీరెడ్డి..

ఎంటరైన శ్రీరెడ్డి..

ఇక ఇలాంటి వార్తలు వస్తే శ్రీ రెడ్డి ఊరికనే ఉంటుందా? తన మనసులో ఉన్నదంతా బయట పెట్టేయ్యదూ. ఆ మధ్య ఐటీ దాడులు జరిగితే కూడా ఇలానే స్పందించింది. అన్నపూర్ణ స్టూడియో, రానా, వెంకటేష్, నాని కార్యాలయాల్లో ఐటీ దాడులు జరగడంపై శ్రీరెడ్డి సంచలన కామెంట్స్ చేసింది. పాపం ఊరికనే పోదంటూ శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు తెగ వైరల్అయ్యాయి. తాజాగా అభిరామ్ కారుకు ప్రమాదం అనగానే ఓ వీడియోను రిలీజ్ చేసింది.

నీదో డొక్కు కారు..

నీదో డొక్కు కారు..


ఇక దగ్గుబాటి అభిరామ్ కారుకు ప్రమాదం అన్న వార్తలపై శ్రీరెడ్డి స్పందిస్తూ.. ‘అభి నీకు గుర్తుందా? నీ కారెంత? నీ స్థాయి ఎంత? నేను రానా తమ్ముడిని? సురేష్ బాబు కొడుకును? రామా నాయుడు మనవడిని? నీదో డొక్కు కారు? నువ్ ఆఫ్ట్రాల్ రోడ్ సైడ్ యాక్టర్‌వి అని అన్నావే? నన్ను, నా కార్‌ను అవమానించావే? ఈ రోజు నీ కారుకు ఏదో యాక్సిడెంట్ అయినట్టుంది.

దేవుడు ఉన్నాడ్రా..

దేవుడు ఉన్నాడ్రా..

దేవుడు ఉన్నాడ్రా.. దేవుడు ఉన్నాడు ఎప్పుడూ మిడిసిపడకు.. ఈ డబ్బులు పేరు అందం అన్నీ అశాశ్వతం.. శాశ్వతమైనవి కొన్నే మంచితనం, మంచి పేరు ఎదుటివారిని అర్థం చేసుకోవడం ఎదుటోళ్లకు అపకారం చేయకుండా మంచిగా ఉండటం. నేనైతే ఓ పెద్ద అంత పెద్ద ఉత్తమురాలిని, మహర్షిని అయితే కాకపోవచ్చు గానీ చాలా మటుకు ఫాలో అవుతున్నాను.. నేర్చుకుంటున్నాను' అని చెప్పుకొచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X