ఇండియన్ లా, పోలీసులపై శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. మోదీకి హాట్సాఫ్ అంటూ ఫైర్

ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన దిశా హత్య ఘటన యావత్ భారత దేశంలో చర్చనీయాంశంగా మారింది. దేశవ్యాప్తంగా జనం, సెలబ్రిటీలు ఈ హత్యను ఖండిస్తున్నారు. మానవ మృగాల రాక్షసత్వానికి బలైన వెటర్నరీ డాక్టర్ తరుపున యావత్ లోకం నిరసరస జ్వాలలు రగుల్చుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ దుర్ఘటనపై స్పందిస్తూ ఫైర్ అయింది శ్రీ రెడ్డి. ఈ మేరకు ఓ వీడియో ద్వారా అందరి ముందుకొచ్చింది. వివరాల్లోకి పోతే..

ఆడపిల్లంటే లెక్కలేకుండా పోతోంది

ఆడపిల్లంటే లెక్కలేకుండా పోతోంది

రెండు రోజుల నుంచి తాను సరిగా తినలేదని, సరిగా పాడుకోలేదని చెప్పింది శ్రీ రెడ్డి. దిశా ఘటన తెలిసి యావత్ దేశం ఉలిక్కిపడిందని పేర్కొంది. ఈ దేశంలో ఆడపిల్లంటే లెక్కలేకుండా పోతోందని ఆవేదన చెందింది. ఈ మేరకు ఆడపిల్లల సేఫ్టీ గురించి మాట్లాడుతూ ఇండియన్ లా పై విరుచుకుపడింది. ఈ మేరకు స్వయంగా వీడియో పోస్ట్ చేసింది శ్రీ రెడ్డి.

మా జీవితానికి సేఫ్టీ లేదా? ఈ దేశంలో ఆడపిల్లకు రక్షణే లేదా?

మా జీవితానికి సేఫ్టీ లేదా? ఈ దేశంలో ఆడపిల్లకు రక్షణే లేదా?

ఇలాంటి దుశ్చర్యలకు పూనుకునేందుకు మీకెందుకింత ధైర్యం? ఎవ్వరూ ఏమీ చేయలేరనా? లేక ఈ దేశంలో ఏం చేసినా శిక్షలు తక్కువగా ఉన్నాయనా? అని ప్రశ్నించింది శ్రీ రెడ్డి. ఒకటి కాదు రెండు కాదు ప్రతీ నిమిషం, ప్రతీ రోజు ఇలాంటి లైంగిక దాడులే చూస్తున్నాం. అంటే మా జీవితానికి సేఫ్టీ లేదా? ఈ దేశంలో ఆడపిల్లకు రక్షణే లేదా? ప్రశ్నిస్తూ ఫైర్ అయింది శ్రీ రెడ్డి.

న్యాయవ్యవస్థలో లొసుగులు.. ఆ ధైర్యమే

న్యాయవ్యవస్థలో లొసుగులు.. ఆ ధైర్యమే

మనదేశంలో ఉన్న న్యాయవ్యవస్థ చాలా వీక్ గా ఉందని, చాలా లొసుగులు ఉన్నాయని ఉదాహారణలతో సహా వివరించింది. అమ్మాయిలను రేప్ చేయడం, పొడిచేయడం ఇక్కడ చాలా ఈజీ అయిపొయింది. లా లో ఉన్న లొసుగులు, ఎలాగైనా తప్పించుకోవచ్చనే ధైర్యమే నిందితులకు ప్రధాన బలమైందని పేర్కొంటూ కామెంట్స్ చేసింది.

పోలీసుల సంఖ్య.. అలాంటి నీచమైన స్థితి

పోలీసుల సంఖ్య.. అలాంటి నీచమైన స్థితి

ఒకవేళ పోలీసుల సంఖ్య తక్కువగా ఉందంటే ఆ సంఖ్య పెంచుకోండి. పెట్రోలింగ్ ముమ్మరం చేయండి అంటూ సలహా ఇచ్చింది శ్రీ రెడ్డి. ఈ రోజుల్లో జడ్జ్ లను కూడా కొనేస్తున్నారు. అలాంటి నీచమైన స్థితి నెలకొంది. సొంతింట్లో తండ్రి కాటేస్తాడు, ముసలోడు చిన్న పిల్లను రేప్ చేస్తాడు. ఇంకెంతమంది ఇలా చనిపోవాలి? అంటూ ఆవేదన చెందింది శ్రీ రెడ్డి.

Recommended Video

#CineBox : Nani's New Film Titled Tuck Jagadish
అందుకే ఇలాంటి మానవ మృగాలు రెచ్చిపోతున్నాయి

అందుకే ఇలాంటి మానవ మృగాలు రెచ్చిపోతున్నాయి

దుబాయ్ లాంటి దేశాల్లో ఇలాంటి ఘటనలు జరిగితే వెంటనే నరికేస్తారు. కానీ ఇండియాలో అలా లేదు. అందుకే ఇలాంటి మానవ మృగాలు రెచ్చిపోతున్నాయి. వీలైనంత తొందరగా రాజ్యాంగంలో సవరణలు చేసి అలాంటి వారిని కఠినంగా శిక్షించేలా చట్టంలో మార్పు తీసుకురండి అని తెలిపింది శ్రీ రెడ్డి.

మోదీకి హాట్సాఫ్.. ప్లీజ్ సేవ్ గర్ల్స్

నేను గౌరవించదగిన అమ్మాయిని కాకపోవచ్చు. నా మాటకు అంత విలువ లేకపోయి ఉండొచ్చు కానీ నేను మాట్లాడుతున్న ఈ ష్యూని సీరియస్ గా తీసుకోండని వేడుకొంది శ్రీ రెడ్డి. మోదీకి హాట్సాఫ్.. మీరు ఎన్నో కొత్త చట్టాలు తీసుకొచ్చారు. దయచేసి ఇలాంటి ఘటనలపై దృష్టి పెట్టండి. 'ప్లీజ్ సేవ్ గర్ల్స్' అంటూ ఆవేశంగా మాట్లాడింది శ్రీ రెడ్డి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X